Diwali 2022: అసలైన వెండి నాణేలు గుర్తించడం ఎలా..?

Diwali 2022: అసలైన వెండి నాణేలు గుర్తించడం ఎలా..?

Update: 2022-10-19 15:23 GMT

Diwali 2022: అసలైన వెండి నాణేలు గుర్తించడం ఎలా..?

Diwali 2022: హిందూ మతంలో దీపావళి పండుగకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అమావాస్య రోజున ఈ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా బంగారం, వెండి మార్కెట్‌లో హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఈ పండుగకి చాలా మంది వెండి వస్తువులు కొనడానికి మొగ్గుచూపుతారు. మీరు కూడా ఈ పండుగకి వెండి నాణేలను కొనాలని ఆలోచిస్తున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి.

ఎందుకంటే నకిలీ వెండి నాణేలని వినియోగదారులకి అంటగడుతున్నారు. వివిధ నగరాలలో ఈ దందా జోరుగా కొనసాగుతోంది. ఈ నాణేలలో వెండికి బదులుగా 99 శాతం గిల్ట్ లేదా జర్మన్ వెండి కలుపుతున్నారు. వీటికి సిల్వర్‌ కోటింగ్‌ వేసి వినియోగదారులకి అమ్ముతున్నారు. అయితే ఇలాంటి నాణేలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా నష్టపోతారు.

ఎంత ఖర్చవుతుంది?

కిలో నకిలీ నాణేల తయారీకి దాదాపు రూ.800-900 వరకు ఖర్చవుతుండగా మార్కెట్‌లో కిలో రూ.55 వేల నుంచి 57 వేల వరకు విక్రయిస్తున్నారు. జర్మన్ వెండిని తయారు చేయడానికి రాగి, నికెల్, జింక్ ఉపయోగిస్తారు. ఇది వెండిలానే ఉంటుంది. కానీ అందులో అసలైన వెండి ఉండదు. మీ నుంచి 65%, 70%, 80% స్వచ్ఛత ఉన్న వెండికి 100% అమౌంట్‌ తీసుకుంటారు. అంతేకాకుండా మేకింగ్ ఛార్జ్ అంటూ విడిగా వసూలు చేస్తారు.

తనిఖీ చేయడానికి మార్గాలు

1. వెండిని కొనుగోలు చేసేటప్పుడు దానిని అయస్కాంత పరీక్ష చేయవచ్చు. వెండిని అయస్కాంతం ఆకర్షిస్తే అది నిజమైన వెండి కాదు.

2. స్నోఫ్లేక్స్ ద్వారా కూడా వెండిని గుర్తించవచ్చు. మంచు ముక్కపై నిజమైన వెండి నాణేన్ని ఉంచినప్పుడు మంచు చాలా వేగంగా కరుగుతుంది.

3. వెండి నాణెం రాతిపై రుద్దితే తెల్లటి చారలు ఏర్పడితే వెండి నిజమేనని అర్థం చేసుకోండి. చారల రంగు పసుపు రంగులో ఉంటే వెండి కల్తీ అయినట్లు అర్థం.

Tags:    

Similar News