Amazon Prime Day Sale 2025: భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో అమెజాన్ ప్రైమ్ డే వచ్చేస్తోంది!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వార్షిక మెగాసేల్ ఈవెంట్ "ప్రైమ్ డే సేల్ 2025" తేదీలను అధికారికంగా ప్రకటించింది. జూలై 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్, జూలై 14వ తేదీ వరకు ముగుస్తుంది.
Amazon Prime Day Sale 2025: భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో అమెజాన్ ప్రైమ్ డే వచ్చేస్తోంది!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వార్షిక మెగాసేల్ ఈవెంట్ "ప్రైమ్ డే సేల్ 2025" తేదీలను అధికారికంగా ప్రకటించింది. జూలై 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్, జూలై 14వ తేదీ వరకు ముగుస్తుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సేల్‌లో ప్రముఖ గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు తదితర కేటగిరీలపై భారీ తగ్గింపులు, ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
ప్రైమ్ డే ప్రత్యేకతలు:
ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ సేల్‌లో వారు ఎక్స్‌క్లూజివ్ డీల్స్, కొత్త ప్రోడక్ట్ లాంచ్‌లు, టైమ్-లిమిటెడ్ ఆఫర్లను పొందే అవకాశం ఉంటుంది. అయితే ప్రైమ్ కాని వినియోగదారులకు కూడా కొన్ని అదనపు ప్రయోజనాలు అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది.
బ్యాంక్ కార్డులకు బంపర్ తగ్గింపులు:
ఈ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు మరియు ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపులు ఈఎంఐ లావాదేవీలపై కూడా వర్తిస్తాయి.
Amazon Pay వినియోగదారులకు స్పెషల్ ఆఫర్లు:
Amazon Pay UPI ద్వారా రూ.1000 పైగా రెండో కొనుగోలుపై ₹100 క్యాష్‌బ్యాక్.
Amazon Pay Later ద్వారా అర్హత గల వినియోగదారులకు రూ.60,000 వరకు తక్షణ క్రెడిట్, ₹600 విలువైన వెల్‌కమ్ రివార్డులు.
Amazon Pay ICICI క్రెడిట్ కార్డు హోల్డర్లకు 5% క్యాష్‌బ్యాక్‌తో పాటు అదనంగా 5% తక్షణ తగ్గింపు.
వెల్‌కమ్ రివార్డులు అందరికీ:
ప్రైమ్ సభ్యత్వం తీసుకునే కొత్త వినియోగదారులకు ₹3,000 వరకు విలువైన రివార్డులు అందుబాటులో ఉంటాయి. ఇందులో ₹200 షాపింగ్ క్యాష్‌బ్యాక్‌తో పాటు ₹2,800 విలువైన ఇతర బెనిఫిట్లు ఉన్నాయి. నాన్-ప్రైమ్ వినియోగదారులు కూడా ₹2,000 వరకు వెల్‌కమ్ రివార్డులు పొందవచ్చు. వీరికి ₹150 క్యాష్‌బ్యాక్, ₹1,850 విలువైన రివార్డులు, అలాగే ప్రైమ్ సభ్యత్వంపై ₹500 తగ్గింపు లభిస్తుంది.
మొత్తం విషయమేమిటంటే, ఈ మూడు రోజులు షాపింగ్ ప్రేమికులకో స్వర్గం లాంటి వారాలు! భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, లిమిటెడ్ టైమ్ డీల్స్ అన్నీ వన్ స్టాప్‌గా అమెజాన్‌లో సిద్ధంగా ఉన్నాయి. మరి మీరు సిద్ధంగా ఉన్నారా?