Burial Ground Restaurant: సమాధుల మధ్య రెస్టారెంటా? పైగా అక్కడకు సెలబ్రెటీలు వెళ్లారా?

Burial Ground Restaurant: పచ్చని చెట్లు, పూల మధ్య రెస్టారెంట్లు ఉండటం చూశాం.. అడవులు, జైళ్లు, రైల్వేస్టేషన్ల కాన్సెప్ట్‌తో నిర్మించిన రెస్టారెంట్లనీ చూశాం.

Update: 2025-07-14 05:12 GMT

Burial Ground Restaurant: సమాధుల మధ్య రెస్టారెంటా? పైగా అక్కడకు సెలబ్రెటీలు వెళ్లారా? 

Burial Ground Restaurant: పచ్చని చెట్లు, పూల మధ్య రెస్టారెంట్లు ఉండటం చూశాం.. అడవులు, జైళ్లు, రైల్వేస్టేషన్ల కాన్సెప్ట్‌తో నిర్మించిన రెస్టారెంట్లనీ చూశాం. ఇదేంది.. సమాధుల మధ్య రెస్టారెంటా? ఎవరైనా అక్కడకు వెళతారా? ఒకవేళ వెళ్లినా ఏమైనా తింటారా? అని మీరు అనుకుంటున్నారు కదా. కానీ.. అక్కడకు వెళ్లారు.. ఎవరో కాదు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎం ఎఫ్ హుస్సేన్ ఆ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ చాలా ఫేమస్ అయిన చాయ్, మస్కా బన్నుని తిని మరీ వచ్చారు. ఇంతకీ ఈ సమాధుల రెస్టారెంట్ ఎక్కడుందో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే పదండి.

చుట్టూ సమాధులు, మధ్యలో టేబుల్స్. ఇంక అక్కడకు వెళ్లిన వాళ్లు టీ, మస్కా బన్నుని లొట్టలేసుకుని మరీ తింటారు. ఎందుకంటే ఈ రెస్టారెంట్‌లో ఇవి ఫేమస్. అందుకే దేశం నలుమూలల నుంచీ ఇక్కడకు వస్తారు. ఈ రెస్టారెంట్‌కు వెళ్లిన వాళ్లు చాలా థ్రిల్లింగ్ ఫీలై టేస్టీ ఫుడ్ తినేసి వస్తారు. అంతేకాదు, ఈ రెస్టారెంట్ పేరు లక్కీ రెస్టారెంట్. సో.. ఇక్కడకు వెళ్లిన వాళ్లు లక్కీతో తిరిగి వస్తారట.

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం లాలా దర్వాజాలో ఈ లక్కీ రెస్టారెంట్ ఉంది. ఇందులో దాదాపు 26 సమాధాలు ఉంటాయి. ప్రతి రోజు ఇక్కడ సిబ్బంది ఈ సమాధులకు పూజలు చేస్తూ ఉంటారు. నిత్యం కస్టమర్లతో ఈ రెస్టారెంట్ నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాయ్, మస్కా బన్ చాలా ఫేమస్. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ చాయ్, మస్కా బన్నును తినడానికి జనం వస్తుంటారు.

స్థానికులే కాదు చాలామంది ప్రముఖులు కూడా ఈ రెస్టారెంట్‌కు వస్తుంటారు. గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, చిత్రకారుడు ఎమ్ ఎఫ్ హుస్సేన్‌ కూడా ఈ రెస్టారెంట్‌కు వెళ్లడం పెద్ద సంచలనం కూడా అయింది. ఎంతోమంది ఇక్కడ టీ, బన్ను నచ్చడానికి కారణం ఏంటంటే.. ఇక్కడే అవన్నీ స్వయంగా చెఫ్‌లు తయారు చేస్తారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా కస్టమర్లకు అందిస్తారు. ఒక సమాధులకు పూజలు, మరోపక్క కస్టమర్లతో ఈ రెస్టారెంట్ ఎప్పుడూ హడావిడిగా ఉంటుంది.

26 సమాధులు, రెండు చెట్ల మధ్యలో ఈ రెస్టారెంట్‌ను నిర్మించారు. ఈ రెస్టారెంట్‌ను 1950లో మహమ్మద్ భాయ్ అనే వ్యక్తి స్థాపించారు. అయితే ఇక్కడకు ముస్లింలు మాత్రమే కాదు హిందువులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. ఇక్కడ సమాధులకు పూజలు చేస్తారు. ఈ రెస్టారెంట్ హిందు, ముస్లి ఐక్యతకు నిదర్శనమని అక్కడ సిబ్బంది చెబుతారు.

Tags:    

Similar News