Before Death: మరణ సమయంలో ఈ 4 పనులు చేస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుంది.. అవేంటంటే..?

Before Death: భగవద్గీతలో చెప్పినట్లుగా ప్రతి మనిషికి పుట్టుకతో పాటు చావు కూడా ఉంటుంది. దీనిని తప్పించుకోవడం అసాధ్యం.

Update: 2023-09-24 16:00 GMT

Before Death: మరణ సమయంలో ఈ 4 పనులు చేస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుంది.. అవేంటంటే..? (Representative Image) 

Before Death: భగవద్గీతలో చెప్పినట్లుగా ప్రతి మనిషికి పుట్టుకతో పాటు చావు కూడా ఉంటుంది. దీనిని తప్పించుకోవడం అసాధ్యం. అయితే గరుడపురాణం ప్రకారం చనిపోయేముందు నాలుగు పనులు చేస్తే చావు కూడా ఒక పండుగ అవుతుంది. హిందూ మతం ప్రకారం ఒక వ్యక్తి అతడు చేసిన మంచి చెడులని బట్టి స్వర్గం, నరకలని పొందుతాడు. అయితే తప్పులు చేసినవారు చనిపోయే ముందు పశ్చాత్తాపడుతారు. తాము నరకానికి వెళుతామని బాధపడుతుంటారు. ఇలాంటి సమయంలో గరుడ పురాణం ప్రకారం ఈ 4 పనులు చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి.

గంగా నీరు

హిందూ మతంలో గంగా జలానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గంగా జలం మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఒక వ్యక్తి మరణించేటప్పుడు అతని నోటిలో గంగాజలం పోయడం వల్ల అతని పాపాలన్నీ నశిస్తాయి. అతనికి స్వర్గంలోకం లభిస్తుంది.

భగవద్గీత పారాయణం

ఒక వ్యక్తి మరణ సమయంలో భగవద్గీత పారాయణం చేస్తే ఆ వ్యక్తి తన జీవితాన్ని సులభంగా వదిలివేయగలడు. యమదూతలు అతనిని తాకలేరు. అంటే ఆ వ్యక్తికి స్వర్గంలో స్థానం లభిస్తుంది.

తులసి నీరు

హిందూ మతంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది చాలా పవిత్రమైనది మరణ సమయంలో వ్యక్తి నోటిలో తులసి నీటిని పోయడం వల్ల అతడి ముగింపు సంతోషంగా ఉంటుంది. అతని ఆత్మ స్వర్గంలో చోటు సంపాదిస్తుంది. 

శ్రీరామ నామస్మరణ

ఒక వ్యక్తి మరణించే సందర్భంలో శ్రీరామ నామస్మరణ చేయడం వల్ల పుణ్యలోకాలు పొందుతాడు. మనిషి పాపాలన్ని నశిస్తాయి. అతడు యమరాజు శిక్ష నుంచి విముక్తి పొందుతాడు.

Tags:    

Similar News