Viral Video: కల్లు సీసాలో కట్లపాము.. సీసా ఖాళీ చేసి చూడగా షాక్‌..!

Viral Video: ఎక్కడ చూసినా ఇప్పుడు కల్తీ రాజ్యమేలుతోంది. ఆరోగ్యానికి మంచి చేసే ఆహార పదార్థాల నుంచి చివరికి లిక్కర్‌ వరకు కల్తీ చేస్తున్నారు.

Update: 2025-01-17 09:36 GMT

Viral Video: కల్లు సీసాలో కట్లపాము.. సీసా ఖాళీ చేసి చూడగా షాక్‌..!

Viral Video: ఎక్కడ చూసినా ఇప్పుడు కల్తీ రాజ్యమేలుతోంది. ఆరోగ్యానికి మంచి చేసే ఆహార పదార్థాల నుంచి చివరికి లిక్కర్‌ వరకు కల్తీ చేస్తున్నారు. ఇక నాణ్యత పరిశుభ్రతను సైతం గాలికి వదిలేస్తున్నారు. మద్యం బాటిళ్లలో బల్లులు, కప్పలు కనిపించడం ఇటీవల ఎక్కువుతోంది. బీర్‌ బాటిల్స్‌లో బొద్దింకలు, పురుగులు, బ్లేడ్‌లు కనిపించిన సంఘటనలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. కొందరి నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తోంది.

తాజాగా ఇలాంటి ఓ సంఘటన సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. నాగర్‌ కర్నూల్‌లోని బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. కల్లు దుకాణానికి వెళ్లిన ఓ యువకుడు చూసిన దృశ్యం ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది. దీంతో ఈ విషయాన్ని స్మార్ట్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇంకేముంది ఈ వీడియో క్షణాల్లో నెట్టింట ట్రెండ్‌ అయ్యింది.

ఆ యువకుడు కల్లు దుకాణంలో కల్లు సీసా తీసుకొని తాగేందుకు ప్రయత్నించాడు. అంతలోనే సీసాలో ఏదో ఉన్నట్లు గమనించాడు. వెంటనే సీసాలోని కల్లును కింద పడేశాడు. బాటిల్‌ చివరలో కట్ల పాము పిల్ల ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని యజమాని దృష్టికి తీసుకెళ్లగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.

దీంతో గ్రామస్థులంతా ఏకమై కల్లు దుకాణంలో ఉన్న సరుకును ధ్వంసం చేశారు. పాము పిల్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

 

Tags:    

Similar News