65 ఏళ్ల వయసులో 44 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడిన మహిళ.. బహుమతుల వర్షం.. చివరికి షాకింగ్ ట్విస్ట్..!

ప్రేమకు వయస్సు అడ్డంకి కాదని చాలామంది చెబుతుంటారు. కానీ వయసు తేడా ఎక్కువగా ఉన్నప్పుడు అనుమానాలు, ప్రశ్నలు తప్పవు. అలా బ్రిటన్‌కు చెందిన 65 ఏళ్ల జెనా అనే మహిళ జీవితం పూర్తిగా మారిపోయింది.

Update: 2025-08-28 16:02 GMT

65 ఏళ్ల వయసులో 44 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడిన మహిళ.. బహుమతుల వర్షం.. చివరికి షాకింగ్ ట్విస్ట్..!

ప్రేమకు వయస్సు అడ్డంకి కాదని చాలామంది చెబుతుంటారు. కానీ వయసు తేడా ఎక్కువగా ఉన్నప్పుడు అనుమానాలు, ప్రశ్నలు తప్పవు. అలా బ్రిటన్‌కు చెందిన 65 ఏళ్ల జెనా అనే మహిళ జీవితం పూర్తిగా మారిపోయింది. సెలవుల కోసం గాంబియాలోని బంజుల్ నగరానికి వెళ్ళిన జెనా, అక్కడ 44 ఏళ్ల వెయిటర్ ఎబ్రిమాను కలిసింది. అతని ఆకర్షణ, ఫిట్‌నెస్ చూసి ఆమె మురిసిపోయింది. పెద్ద వయసు పురుషులు నచ్చవని చెప్పిన జెనా, ఎబ్రిమాపై ప్రేమలో పడిపోయింది.

ఎబ్రిమా ఒక ముస్లిం కావడంతో జెనా మద్యం తాగడం, బహిరంగ దుస్తులు ధరించడం అతనికి ఇష్టం ఉండేది కాదు. కానీ జెనా క్రమంగా ఇవన్నీ అంగీకరించింది. అతనికి ఖరీదైన ఐఫోన్‌ నుంచి ఆర్థిక సహాయం వరకు ఎన్నో గిఫ్టులు ఇచ్చింది. అయితే ఈ సంబంధం బయటపడిన వెంటనే సోషల్ మీడియాలో జెనాపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ ఆమె "నిజంగా నేను ప్రేమిస్తున్నాను" అంటూ తన నిర్ణయంలో నిలబడింది.

అంతలోనే షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. జెనా మనవరాలు టిల్లీ, ఎబ్రిమా ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను కనిపెట్టింది. అందులో అతనికి అనేక గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నట్లు తేలింది. అంతే కాదు, ఎబ్రిమా "సిస్టర్" అని పిలుస్తున్న మహిళ వాస్తవానికి అతని భార్య అయి ఉండవచ్చన్న అనుమానం జెనాకు కలిగింది. ఆ మహిళ కుమారుడు ఎబ్రిమాను "పప్పా" అని పిలవటం చూసి జెనా మరింత షాక్‌ అయ్యింది.

కానీ, ఎబ్రిమా మాత్రం ఇవన్నీ అబద్ధమని, సోషల్ మీడియా మెసేజ్‌లు సరదాగా రాసుకున్నవని చెప్పాడు. అతడి మాటలపై కోపం వచ్చినా, చివరికి జెనా అతన్ని క్షమించి మరో అవకాశం ఇచ్చింది. ఈ జంట భవిష్యత్తులో కలసి జీవించాలని నిర్ణయించుకున్నారు.

ఒక అబద్ధం కారణంగా కుదేలైన ఈ విభిన్నమైన ప్రేమకథ మళ్లీ కొత్త ఆరంభానికి సిద్ధమవుతోంది.

Tags:    

Similar News