లాక్ డౌన్ ఎఫెక్ట్.. స్వచ్చంగా కనిపిస్తున్న యమునా నది!

Update: 2020-04-06 02:42 GMT

ఒక్కోసారి చెడు కూడా మంచి చేస్తుంది. అందుకు కరోనా వైరస్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కరోనా మహమ్మారి జన జీవితాలను అస్తవ్యస్తం చేసిపారేసింది. సాధారణ జనజీవితం అతలాకుతలం అయిపొయింది. అందరూ ఇళ్ళకు పరిమితమైపోయే స్థితి వచ్చింది. ఇంకా ఎన్నో నష్టాలు కరోనా కారణంగా ప్రపంచ మానవాళి ఎదుర్కుంటోంది. అయితే, ఇంత విపత్కర పరిస్థితిలోనూ కొన్ని వార్తఃలు మానవ భవిష్యత్ పై ప్రభావం చూపించే విధంగా వెలుగు చూస్తున్నాయి. ప్రకృతి వినాశనం చేస్తున్న కాలుష్యం నివారణ కరోనాతో సాధ్యం అయింది.

ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా వాతావరణ కాలుష్యం బాగా తగ్గిపోయినట్టు నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు తాజాగా యమునా నదిలో వచ్చిన మార్పులు కాలుష్యం విషయంలో మనం చేస్తున్న తప్పులు సరిచేసుకున్ దిశలో ఆలోచనలు చేయాల్సిన అవసరాన్ని చూపిస్తోంది. సంవత్సరాలుగా ప్రభుత్వాలు నదుల్లో కాలుష్యాన్ని తగ్గించాలని చేయని ప్రయత్నాలు లేవు. కానీ, ఏవీ ఫలించలేదు. కానీ కొద్దిరోజుల లాక్ డౌన్ సమయం గణనీయమైన మార్పులు యమునా నదిలో తీసుకువచ్చినట్టు కనిపిస్తోంది. యమునా నది ఇప్పుడు చూస్తె నీలం రంగులో ఆహ్లాదంగా కనిపిస్తోంది.

దీనికి కారణం యమునా నది పరిసరాల్లో ఉన్న పరిశ్రమలు లాక్ డౌన్ కారణంగా మూతపడటం ప్రధానంగా చెప్పుకోవచ్చు. యమునా నది యమునోత్రి నుంచి అలహాబాద్ వరకూ దాదాపు 1,370 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇందులో దిల్లె దగ్గరలో మొత్తం వజీరాబాద్ నుంచి వాకల వరకూ 22 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే తన ప్రయాణంలో 2 శాతం దూరం మాత్రమే ఈ ప్రాంతంలో ప్రయాణిస్తుంది. కానీ, ఈ అతి కొద్ది ప్రయాణంలో 76 శాతం నదీజలాలు కాలుష్యం బారిన పడుతున్నట్టు గత సంవత్సరం YMC ప్రకటించింది.

ఒక్క డిల్లీ పరిసరాల్లోనే దాదాపు 30,000 చిన్న పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో Delhi Industrial and Infrastructure Development Corporation Ltd లెక్కల ప్రకారం 910 కంపెనీలు నేరుగా కాలుష్య కారకాలను యమునా నదిలోకి వదిలేస్తున్నాయి. ఈమేరకు ఆయా కంపెనీలకు గత సంవత్సరం జరిమానాలు విధించారు. నిజానికి ఈ పరిశ్రమలు అన్నీ కామన్ ఎప్ఫ్లుఎంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (CETP) ద్వారా మాత్రమె వెస్ట్ వాటర్ ను తరలించాల్సి ఉంది. కానీ ఈ నిబంధనను చాలా పరిశ౫రమలు పాటించడం లేదు. దిల్లీలో 28 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉన్నాయి. వాటిలో 17 క్లస్టర్లు మాత్రమె CETP కి అనుసంధానం అయ్యాయి. అయితే 11 క్లస్టర్స్ ఇప్పటికీ అనుసంధానం కాలేదు. ఈ విషయాన్ని YMC 2018 డిసెంబర్లో వెల్లడించింది.

డిల్లీ జల మండలి రిపోర్టు ప్రకారం మొత్తం 748 MGD ల మురికినీరు ఉత్పన్నమవుతోంది. దానిలో కేవలం 790 MGDలు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తన్నారు. మిగిలిన మురికి అంతా అలానే నేరుగా యమునా నదిలో కలిసిపోతోంది.

ఇన్ని కారణాలతో కాలుష్యం బారిన పడిన యమునా నది ఈ లక్దౌన్ పుణ్యమా అని కొంత తెరుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వాలు, పరిశ్రమల వర్గాలు కళ్ళు తెరవాల్సిన అవసరం కనిపిస్తోంది. యమునా నది మాత్రమే కాదు కాలుశ్యాం బారిన పడిన అన్ని నదుల నుంచి ఈ లక్దౌన్ సమయంలో సాంపిల్స్ సేకరించి వాటిని పరీక్షలు జరపాలి. తద్వారా కాలుష్య కారకాలను కచ్చితంగా గుర్తించే అవకాశం ఉంటుంది. తదుపరి తీసుకోవాల్సిన చర్యలను కూడా సిద్ధం చేసుకునే అవకాశం ఈ లక్దౌన్ సమయం కల్పిస్తోంది.


Tags:    

Similar News