వేడి వాతావరరణంలో ఈ వైరస్ మనుగడ సాగించే అవకాశం తక్కువ : WHO ప్రతినిధి డేవిడ్

కోవిడ్ -19 పై మాట్లాడటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రత్యేక ప్రతినిధి డేవిడ్ నబారో ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Update: 2020-03-27 03:45 GMT
David Nabarro

కోవిడ్ -19 పై మాట్లాడటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రత్యేక ప్రతినిధి డేవిడ్ నబారో ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.. దీనిపై ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో 17 మంది మరియు ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని చంపిన కరోనావైరస్ కొత్త రియాలిటీ కానుంది. ఇకపై కరోనావైరస్ తో జీవించడం ప్రపంచం నేర్చుకోవలసి ఉంటుందని డేవిడ్ నబారో అన్నారు. అయినప్పటికీ, ప్రారంభ వ్యాప్తితో వ్యవహరించడం, సోకిన వారిని గుర్తించడం మరియు వారిని ఒంటరిగా ఉంచడం వలన దాని వ్యాప్తిని నివారించడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నించాలని ఆయన సూచించారు. ప్రపంచం మొత్తం ఈ మహమ్మారిపై పోరాడుతోంది. దీనిపై ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సమాచారం అందించడంతోపాటు వీలైన ఏర్పాట్లను చేయాలనీ చెప్పారు.

కరోనావైరస్ వ్యాప్తిని కంట్రోల్ చెయ్యడానికి లాక్డౌన్ సహాయపడుతుందా? అని అడిగితే.. "ఈ మహమ్మారి చాలా వేగంగా విస్తరిస్తోంది. కొన్ని రోజులకు ఇది రెట్టింపు పరిమాణంలో ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి దాని తీవ్రతను తగ్గించడానికి అన్ని దేశాల ఇటువంటి చర్యలు అవసరం.. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే.. వ్యాధి సోకిన సదరు వ్యక్తిని దూరంగా ఉంచాలి.. అంతేకాకుండా వీరందరికి అవసరమైన ఐసోలేషన్ వార్డులను ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యాలి అని అన్నారు. ఇక వేడి వాతావరరణంలో వైరస్ వ్యాప్తి తగ్గుతుంది.. అధిక ఉష్ణోగ్రతలో ఇటువంటి వైరస్ లు మనుగడ సాగించే అవకాశం తక్కువ అని నమ్ముతున్నట్టు డేవిడ్ నబారో చెప్పారు.


Tags:    

Similar News