బెల్ట్ తీసి వాయించడం నాకు తెల్సు..అధికారులపై కేంద్రమంత్రి రుస రుసలు!

బెల్టుతో బాదడం తనకేమి కొత్త కాదని కేంద్ర సహాయ మంత్రి రేణుకా సింగ్ వ్యాఖ్యలు చేశారు.

Update: 2020-05-24 16:54 GMT

బెల్టుతో బాదడం తనకేమి కొత్త కాదని కేంద్ర సహాయ మంత్రి రేణుకా సింగ్ వ్యాఖ్యలు చేశారు. క్వారంటైన్ లో ఉన్న వ్యక్తి ఫిర్యాదు మేరకు మంత్రి.. అధికారులపై చిందులు తొక్కారు. ఛత్తీస్‌గడ్ ‌లోని బలరాంపూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో దిలీప్ గుప్తా ఉంటున్నారు, అయితే క్వారంటైన్ కేంద్రంలో సదుపాయాలు బాగా లేవని ఫిర్యాదు చేశాడు. దాంతో ఇది మనసులో పెట్టుకున్న జిల్లా పంచాయతీ రాజ్ కు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తహశీల్దార్‌లు తనపై దాడి చేశారని ఆరోపించారు. దాడి సమాచారం అందుకున్న మంత్రి రేణుకా సింగ్ దిలీప్ గుప్తాతో మాట్లాడటానికి దిగ్బంధం కేంద్రానికి చేరుకున్నారు.

జరిగిన ఘటనపై దిలీప్ గుప్తా, అతని కుటుంబ సభ్యులను కూడా అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా దిలీప్ గుప్తా అధికారులు వ్యవహరించిన తీరు సరిగా లేదని అన్నారు. "కాషాయం ధరించిన" బిజెపి కార్యకర్తలను "బలహీనంగా" భావించవద్దని అధికారులను హెచ్చరించారు. మంత్రి అక్కడితో ఆగలేదు.. గదిలో బంధించి 'బెల్టుతో ఎలా కొట్టాలో' తనకు బాగా తెలుసు అని.. ఇది తనకు కొత్త కాదని అధికారులను హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తల పట్ల వివక్షను విడనాడాలి అంటూ మంత్రి చెప్పారు.  

Tags:    

Similar News