మహారాష్ట్రలో ప్రాధాన్యం సంతరించుకున్నకీలక భేటీలు..

మహారాష్ట్రలో ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది.

Update: 2019-11-04 14:32 GMT
sanjay

మహారాష్ట్రలో ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. పొత్తుల విషయంలో ఫిఫ్టీ -ఫిప్టీ అన్న శివసేన ప్రతిపాదనకు బీజేపీ అంగీకరించని విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుస భేటీలు ప్రాధాన్యం నెలకొంది. శివసేన ముఖ్య నేతలు సంజయ్‌ రౌత్, రాందాస్‌ కదం గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలిశారు. మరోవైపు న్సీపీ అధినేత శరద్‌ పవర్‌ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు.

గవర్నర్‌ను కలిసిన అనంతరం సంజయ్‌ రౌత్‌ స్పందించారు. మర్యాదపూర్వకంగా గవర్నర్ ను కలిసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు సాధించిన పార్టీ ఏదైనా ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. బీజేపీతో జతకట్టకుండా శివసేన ముందుకు వస్తే ఎన్సీపీ, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి శివసేనతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ ఎన్సీపీ సంకేతాలు పంపింది. బీజేపీ మాత్రం సీఎం పదవి శివసేన అడగకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధమని ఆ పార్టీ నాయకులు తెలిపారు. మహారాష్ట్రలో ఈ నెల 8వ తేదీ లోగా ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేయకపోతే గవర్నర్‌ పాలన విధించే అవకాశాలు ఉన్నాయి. 

Tags:    

Similar News