పసిబిడ్డలను అమ్మలా లాలించిన మహిళా పోలీసులు

పరీక్షలకు వచ్చిన ఇద్దరు తల్లులు తమ పిల్లలను జాగ్రత్తగా పోలీసుల చేతిలో పెట్టారు. వారి విధి నిర్వహణ కాకపోయినప్పటికీ పసిబిడ్డలను మురిపంగా లాలిస్తూ మహిళా పోలీసులు అందరి దృష్టిని ఆకర్షించారు.

Update: 2019-11-12 11:47 GMT

పరీక్షలకు వచ్చిన ఇద్దరు తల్లులు తమ పిల్లలను జాగ్రత్తగా పోలీసుల చేతిలో పెట్టారు. వారి విధి నిర్వహణ కాకపోయినప్పటికీ పసిబిడ్డలను మురిపంగా లాలిస్తూ ఇద్దరూ మహిళా పోలీసులు అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఘటన అసోంలోని దారంగ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉపాధ్యాయ ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. అయితే పరీక్షకు క కొందరు అభ్యర్థులు తమ పసిపిల్లలను తీసుకొని వచ్చారు. తల్లులు పరీక్షలు పూర్తీ చేసుకుని వచ్చే వరకు వారి సంరక్షణ పోలీసులు చూసుకున్నారు. కాసేపు ఎత్తుకుని లాలించారు. మహిళా కానిస్టేబుళ్లు బిడ్డలను ఎత్తుకుని ఉన్న ఓ ఫోటోను పీఎస్ అధికారిణి కుల సైకియా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ పోస్టు సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది.

  


Tags:    

Similar News