ఛత్తీస్ గఢ్ లో తూటాల్లా కురిసిన వడగళ్లు

మనిషి మనుగడ కోసం యుద్ధం చేస్తుంటే.. ప్రకృతి కూడా మరోవైపు యుద్ధం చేస్తోంది.

Update: 2020-04-29 14:44 GMT
Representational Image

మనిషి మనుగడ కోసం యుద్ధం చేస్తుంటే.. ప్రకృతి కూడా మరోవైపు యుద్ధం చేస్తోంది.. కరోనా వైరస్ తో ప్రపంచం యుద్ధం చేస్తుంటే, ప్రకృతి తన దాడి తాను కొనసాగిస్తోంది.. అది ఎక్కడో.. ఏంటో మీరే చూడండి.. రాళ్ల వర్షం.. ఆకాశం నుంచి రాళ్ల వర్షం..

హటాత్తుగా.. ఆకాశం నుంచి ఎందుకిలా రాళ్లు పడుతున్నాయి? అవి రాళ్లేనా? లేక తూటాలా? తూటాల శబ్దంలా ఉంది.. అవును ఆకాశం నుంచి కాల్పులు జరపుతున్నారు.. ఇంతకీ ఎవరు? ఎవరీ కాల్పులకు పాల్పడుతున్నది? మీరు వింటున్నది నిజమే.. అది తూటాల్లాంటి శబ్దమే.. ఇది ప్రకృతి చేస్తున్న యుద్ధం. ప్రకృతి చేస్తున్న దాడి.. వడగళ్ల దాడి.. ఎర్రని ఎండాకాలంలో చుర్రుమని ఎండలు కాల్చేస్తుంటే.. మరోవైపు హాటాత్తుగా వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి..ఛత్తిస్ గఢ్ మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల అక్కడ హటాత్తుగా వాతావరణం చల్లబడింది.

ఛత్తీస్ గఢ్ లో ఉన్న పళంగా వర్షం కురిసింది. ఆకాశం నుంచి పెద్ద పెట్టున వడగళ్లు ఒక్కసారిగా పడటంతో జనం బెంబేలెత్తిపోయారు. భీకరమైన గాలుల ఉథృతికి చెట్లు నేలకూలాయి.. వడగళ్ల ధాటికి కార్లపై సొట్టలు పడ్డాయి.కొన్ని కార్లపై చెట్లు విరిగి పడ్డాయి.వడగళ్ల ధాటికి రేకుల షెడ్లకు చిల్లులు పడ్డాయి.. రేకుల షెడ్లన్నీ జల్లెడ మాదిరిగా మారిపోయాయి. వడగళ్ల దెబ్బకి కోతులు పెద్ద సంఖ్యలో చనిపోయాయి.. ఒక వర్షం తెచ్చిన తంటా ఇదంతా..వడగళ్లు పెద్ద పెద్ద రాళ్ల సైజులో పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


Tags:    

Similar News