One Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లు.. లోక్‌సభలో ఓటింగ్
One Nation One Election Bill: జమిలి బిల్లును జేపీసీకి పంపడంపై లోక్ సభలో ఓటింగ్ నిర్వహించారు.
One Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లు.. లోక్‌సభలో ఓటింగ్
One Nation One Election Bill: జమిలి బిల్లుపై లోక్ సభలో ఓటింగ్ నిర్వహించారు. తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ నిర్వహించారు. జమిలి బిల్లును ప్రవేశ పెట్టడంతో పాటు జేపీసీకి పంపడంపై ఓటింగ్ నిర్వహించాలని విపక్షాలు కోరాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు.
ఈ బిల్లుకు అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 మంది ఓటు చేశారు.జమిలి బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టేందుకు మెజారిటీ ఎంపీలు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ బిల్లును ప్రవేశ పెట్టేందుకు స్పీకర్ అనుమతించారు. జమిలి ఎన్నికలపై రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
తాజాగా జమిలి బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ లోక్ సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ బిల్లు ప్రవేశ పెట్టారు. ఇండియా కూటమి ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని ప్రకటించాయి.