కాసేపట్లో లోక్‌సభ ముందుకు జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లు

Update: 2019-08-06 04:52 GMT

ఒకే ఒక్క రోజులో రాజ్యసభలో జమ్ము కశ్మీర్ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన బీజేపీ.. లోక్‌సభలో బంపర్ మెజార్టీతో బిల్లును ఆమోదించేందుకు కసరత్తు ప్రారంభించింది. వివాదాలకు తావు లేకుండా సభలోని అన్ని పార్టీల అభిప్రాయం తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాజ్యసభతో పోల్చుకుంటే, లోక్‌సభలో సొంతంగానే 303 మంది సభ్యులు ఉండటం, మిత్రపక్షాలతో పాటు పలువురు తటస్తులు కూడా బిల్లుకు మద్ధతు ఇవ్వడంతో 400 మంది పైగానే మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలోని మొత్తం 25 మంది ఎంపీలు బిల్లుకు మద్దతు ఇవ్వనున్నారు. తెలంగాణలోనూ MIM, కాంగ్రెస్ సభ్యులను మినహాయిస్తే మిగిలిన 13 మంది బిల్లుకు అనుకూలంగానే ఓటు వేయనున్నారు.    

Tags:    

Similar News