అదనపు చెల్లింపులపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది : కేంద్రమంత్రి రతన్ లాల్

-పోలవరం ప్రాజెక్టు పనులకు అదనపు చెల్లింపులు -నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు

Update: 2019-12-02 16:25 GMT
కేంద్రమంత్రి రతన్ లాల్ కటారియా

పోలవరం ప్రాజెక్టుకు అదనపు చెల్లింపులు జరిపినట్లు కేంద్రజలశక్తి మంత్రి రతన్ లాల్ కటారియా వెల్లడించారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నికు రాతపూర్వకంగా జవాబిచ్చారు. టీడీపీ హయాంలో కాంట్రాక్టర్లకు 2346 కోట్ల రూపాయలు అదనంగా చెల్లింటినట్లు చెప్పారు. ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపుల వ్యవహారంపై నిపుణుల సంఘం విచారణ జరిపి జూలై 2019లో నివేదిక కేంద్ర జలసంఘానికి అంద చేసినట్లు చెప్పారు. హైడల్ ప్రాజెక్టు పనులు చేపట్టక ముందు ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లించారని.. ఇతర పనులకు మిగిలిన డబ్బును అదనంగా చెల్లించారని మంత్రి తెలిపారు. అదనపు చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం విచారణ నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం జరుగుతుందని చెప్పారు. 

Tags:    

Similar News