కొత్త చట్టాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం కాదు

హైదరాబాద్‌, ఉన్నావ్‌లో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనలపై ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు స్పందించారు.

Update: 2019-12-08 11:17 GMT
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

 హైదరాబాద్‌, ఉన్నావ్‌లో మహిళలపై జరిగిన అత్యాచార ఘటనలపై ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు స్పందించారు. మహిళలపై నేరాల నియంత్రణకు కొత్త చట్టాలను తీసుకురవాడం ఒక్కడే పరిషారం కాదని అభిప్రాయపడ్డారు. సింబయోసిస్‌ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో 16వ స్నాతకోత్సవంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహిళలపై అత్యాచారాలు నిరోధించాలంటే కొత్త చట్టాలు తీసుకురావడం ఒక్కటే పరిష్కారం కాదు, పాలనాపరమైన చర్యలు కూడా అవసరమని ఆయన అభిప్రాయడ్డారు. ప్రజలు ఆలోచించే ధోరణిలో మార్పు రావాలి, నిర్భయ చట్టం తెచ్చిన చిన్నారులపై మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ ఘటనలను ప్రస్తావిస్తూ ఇలాంటి ఘటనలు సిగ్గుచేటన్నారు, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతినబూనాలని పిలునిచ్చారు. ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మృతిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యూపీ సీఎం యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఈ ఘటనపై వివిధ వర్గాల చెందిన ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిందితులను వెంటనే శిక్షించాలని మహిళలు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News