ఒంటరిగా వెళ్లే మహిళలకు ఎస్కార్ట్‌

గత కొంత కాలంగా మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌ డీజీపీ ఓ నిర్ణయానికొచ్చారు.

Update: 2019-12-10 08:01 GMT
ఉత్తర్ ప్రదేశ్ పోలీస్

గత కొంత కాలంగా మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌ డీజీపీ ఓ నిర్ణయానికొచ్చారు. ఒంటరిగా వెళ్లే మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తసుకుంటామని తెలిపారు.

ఇదే విషయంపై గతవారం యూపీలోని ప్రయివేటు సంస్థలతో సమావేశమైన డీజీపీ మహిళా ఉద్యోగినుల భద్రతపై చర్చలు జరిపారు. తమ కంపెనీలలో పనిచేస్తు్న్న మహిళా ఉద్యోగినుల సురక్షిత ప్రయాణానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కంపెనీల యాజమాన్యానికి డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాక నగరంలో ఎవరైనా ఆడపిల్లలు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒంటరిగా బయటికి వెళ్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అప్పుడు మహిళల సంరక్షణార్థం ఎస్కార్ట్‌ ఇవ్వనున్నట్లు యూపీ డీజీపీ ఓపీ సింగ్‌ స్పష్టం చేశారు. అత్యవసరంగా మహిళలు 112కు డయల్‌ చేస్తే పోలీసు రెస్పాన్స్‌ వెహికిల్స్‌(పీఆర్వీ)కు సమాచారం అందుతుందని, అక్కడి నుంచి వారి వివరాలను పోలీసులకు అందించాలని తెలిపారు.

ఎస్కార్ట్‌లో తప్పనిసరిగా ఇద్దరు మహిళా పోలీసులు ఉండాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో యూపీలోని మహిళా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని పోలీసు ఉన్నతాధికారులు.


Tags:    

Similar News