Uttar Pradesh: ఆలయంలో తొక్కిసలాట – ఇద్దరు మృతి, 40 మందికి పైగా గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హైదర్‌గఢ్ అవసనేశ్వర్ మహాదేశ్ ఆలయంలో శ్రావణ మాసం సోమవారం తెల్లవారుజామున ఘోర ఘటన చోటుచేసుకుంది.
Uttar Pradesh: ఆలయంలో తొక్కిసలాట – ఇద్దరు మృతి, 40 మందికి పైగా గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హైదర్‌గఢ్ అవసనేశ్వర్ మహాదేశ్ ఆలయంలో శ్రావణ మాసం సోమవారం తెల్లవారుజామున ఘోర ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో విద్యుత్ షాక్‌తో తొక్కిసలాట జరిగి ఇద్దరు మరణించగా, 40 మందికిపైగా గాయపడ్డారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు జలాభిషేకం కోసం తరలివచ్చిన సమయంలో ఈ విషాదం సంభవించింది.
తెలుసుకున్న వివరాల ప్రకారం, కోతుల వల్ల దెబ్బతిన్న పాత విద్యుత్ తీగ ఓవర్‌హెడ్ లైన్‌పై నుంచి తెగి టిన్ షెడ్‌పై పడింది. దీంతో దాదాపు 19 మందికి విద్యుత్ షాక్ తగిలింది. ఒక్కసారిగా భక్తుల్లో గందరగోళం, భయాందోళన నెలకొని తొక్కిసలాట జరిగింది.
మృతుల్లో ఒకరిని లోనికాత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్‌పురా గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్రశాంత్‌గా గుర్తించారు. మరో మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ శశాంక్ త్రిపాఠి ఈ ఘటనపై స్పందిస్తూ, పాత విద్యుత్ లైన్ల నిర్వహణలో లోపాలు కారణమని పేర్కొన్నారు. శ్రావణ మాసంలో భక్తుల రద్దీ పెరిగే కారణంగా భద్రతా ఏర్పాట్లను కఠినతరం చేయాలని అధికారులు సూచించారు.