Nitin Gadkari: గంటకు 170 కిమీ వేగంతో దూసుకుపోయిన కేంద్రమంత్రి

* ఢిల్లీ, ముంబయి ఎక్స్ ప్రెస్ హైవేపై నితిన్ గడ్కరీ స్పీడ్ టెస్ట్ * రూ.98 వేల కోట్లతో ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం

Update: 2021-09-19 16:00 GMT

గంటకు 170 కిమీ వేగంతో దూసుకుపోయిన కేంద్రమంత్రి

Nitin Gadkari: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 170 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లారు. అయితే, ఇదంతా నిర్మాణంలో ఉన్న హైవేపై స్పీడ్ టెస్టు కోసమే.! ఢిల్లీ-ముంబై మధ్య నిర్మాణమవుతున్న ఎక్స్‌ప్రెస్ హైవే పరిశీలన కోసం వెళ్లిన నితిన్ గడ్కరీ ఎక్స్ ప్రెస్ హైవే నిర్దేశిత ప్రమాణాల మేర నిర్మాణం జరుపుకుంటోందా, లేదా అనే అంశాన్ని స్వయంగా పరిశీలించారు. ఆ సమయంలో కియా కార్నివాల్ కారులో గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారు. గడ్కరీతో పాటు అధికారులు కూడా ప్రయాణించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిలను కలిపేందుకు నిర్మిస్తున్న ఈ ఎక్స్ ప్రెస్ హైవే 13వందల 80 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుపుకుంటోంది. దేశంలోనే అత్యంత పొడవైన రహదారి ఇదే కానుంది. 8 లేన్లతో రూపుదిద్దుకుంటున్న ఈ రహదారిని భవిష్యత్తులో 12 లేన్లకు విస్తరించనున్నారు. కాగా, ఎనిమిది లేన్లలో నాలుగు లేన్లు కేవలం ఎలక్ట్రిక్ వాహనాల కోసం కేటాయిస్తుండడం విశేషం. ఈ భారీ రహదారి కోసం రూ98 వేల కోట్లు వెచ్చించింది కేంద్ర ప్రభుత్వం. ఈ రహదారి ద్వారా ఢిల్లీ, ముంబయి నగరాల మధ్య ప్రయాణ దూరం 12 గంటలకు తగ్గుతుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News