కాలేజీలు తెరుచుకునేది అప్పుడే..

ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి కారణంగా కొన్ని పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అంతేకాదు కొద్దిరోజులపాటు విద్యా సంవత్సరం వెనకబడింది.

Update: 2020-04-30 02:35 GMT

ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి కారణంగా కొన్ని పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.. అంతేకాదు కొద్దిరోజులపాటు విద్యా సంవత్సరం వెనకబడింది. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో ఆగస్టులో కళాశాలలు ప్రారంభమవుతాయని యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ (UGC) పేర్కొంది..

అంతేకాదు నూతన విద్యార్ధుల ప్రవేశాలను సెప్టెంబర్‌ నుంచి చేపట్టాలని పేర్కొంది. ఇక దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది UGC. 2020 ఏప్రిల్ 29 న UGC నిపుణుల ప్యానెల్ కమిటీ ఇతర సీనియర్ అధికారులు భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి సమక్షంలో పరీక్షలు , అకాడెమిక్ క్యాలెండర్ కు సంబంధించిన సిఫారసులను విడుదల చేసింది.

1. ఇంటర్మీడియట్ సెమిస్టర్ విద్యార్థులు: ప్రస్తుత , మునుపటి సెమిస్టర్ యొక్క అంతర్గత అంచనా ఆధారంగా గ్రేడ్ ఉండనుంది. అదేక్రమంలో జూలై నెలలో కోవిడ్ -19 పరిస్థితి సాధారణస్థితికి వచ్చిన రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించబడతాయి.

2. టెర్మినల్ సెమిస్టర్ విద్యార్థులు : పరీక్షలు జూలై నెలలో ప్రారంభం అవుతాయి.

3. ప్రతి విశ్వవిద్యాలయంలో ఒక కోవిడ్ -19 సెల్ ఏర్పాటు.

4. అలాగే యుజిసిలో కూడా కోవిడ్ -19 సెల్ ఏర్పాటు.

5. ఒకవేళ అవసరమైతే విశ్వవిద్యాలయాలు జూన్ 01 నుండి 30 రోజుల వరకూ వేసవి సెలవులను పొడిగించుకోవచ్చు.

యుజిసి మార్గదర్శకాలు : విశ్వవిద్యాలయ పరీక్షలు..

తక్కువ వ్యవధిలో పరీక్షలు పూర్తి చేయడానికి విశ్వవిద్యాలయాలు ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపగోంచుకోవాలి.

విశ్వవిద్యాలయాలు పరీక్షల సమయాన్ని 3 గంటల నుండి 2 గంటలకు తగ్గించుకోవచ్చు.

కోవిడ్ -19 దృష్ట్యా పరిస్థితి సాధారణ స్థితికి రాకపోతే, "సామాజిక దూరం", అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకొంటూ.. విద్యార్థులకు గ్రేడింగ్ నమూనాలో.. గత సెమిస్టర్ పెర్ఫామెన్స్ ఆధారంగా 50% మార్కులు, విశ్వవిద్యాలయాలచే ఇంటర్నల్ ఎవాల్యూయేషన్ ద్వారా మిగిలిన 50% మార్కులు ఇవ్వాలి.

విశ్వవిద్యాలయాలు స్కైప్ లేదా ఇతర టెక్నాలజీల ద్వారా ప్రాక్టికల్ పరీక్షలు , వివా-వోస్ పరీక్షలను నిర్వహించుకోవచ్చు, ఇంటర్మీడియట్ సెమిస్టర్ల విషయంలో మాత్రం, తరువాతి సెమిస్టర్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలి.

అలాగే విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ, ఎం. ఫిల్‌లను కూడా నిర్వహించవచ్చు. అయితే గూగుల్, స్కైప్, మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ తో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివా-వోస్ పరీక్షలు నిర్వహించుకోవచ్చు.

Tags:    

Similar News