Uddhav Thackeray: మహారాష్ట్ర సీఎంకు పదవి ముప్పు పొంచిఉందా?
మూడు పార్టీల మద్దతుతో మహారాష్ట్ర సీఎం పీఠమెక్కిన ఉద్ధవ్ థాకరే పదవి మూన్నాళ్ళ ముచ్చట కానుందా? కరోనా సంక్షోభం కారణంగా ఆయనకు పదవి ముప్పు పొంచివుందా? అంటే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తుంది.
మూడు పార్టీల మద్దతుతో మహారాష్ట్ర సీఎం పీఠమెక్కిన ఉద్ధవ్ థాకరే పదవి మూన్నాళ్ళ ముచ్చట కానుందా? కరోనా సంక్షోభం కారణంగా ఆయనకు పదవి ముప్పు పొంచివుందా? అంటే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. రాష్ట్ర సీఎంగా ఠాక్రే గత ఏడాది నవంబర్ 28న పదవీ బాధ్యతలు స్వీకరించినా.. ఇప్పటి వరకు ఏ సభల్లోనూ (అసెంబ్లీ, మండలి) ఆయన సభ్యుడిగా లేరు. ఆయన కుమారుడైతే అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు కానీ.. ఆయన మాత్రం పోటీ చేయలేదు. దాంతో ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలనుకున్నారు.
ప్రస్తుతం అది కుదిరేలా లేదు.. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల లోపు ఏదోఒక సభలో సభ్యత్వం పొందాలి. మే 28 నాటికి ఠాక్రే సీఎంగా ఎన్నికై ఆరు నెలలు పూర్తవుతుంది. ఈ క్రమంలో ఠాక్రేను శాసనమండలికి నామినేట్ చేయాలని మంత్రివర్గం కూడా నిర్ణయించింది. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా దేశంలో జరగాల్సిన అన్ని ఎన్నికలు వాయిదా పడ్డాయి. అలాగే మహారాష్ట్రలో జరగాల్సిన మండలి ఎన్నికలు కూడా నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో మే 28 నాటికి ఉద్ధవ్ ఏ సభలో సభ్యుడు కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలో గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ చేయాలని ప్రభుత్వవర్గాలు ఆలోచన చేస్తున్నాయి. అయితే ఆ కోటాలో ప్రస్తుతం ఉన్న ఇద్దరి సభ్యుల పదవీ కాలం మరో రెండునెలల్లో ముగియనుంది. ఈ రెండు నెలల కాలానికి వారిలో ఎవరో ఒకరి చేత రాజీనామా చేయించి, నామినేట్ చెయ్యడం, ఆ తరువాత మళ్ళీ కాలవ్యవధి రీత్యా రెండు నెలలలోపు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే ఇలా నామినేట్ చేయడానికి దాని పదవీ కాలం కనీసం ఏడాది పాటు అయినా మిగిలి ఉండాలని బీజేపీ వాదిస్తోంది. మరి ఏమి జరుగుతుందో చూడాలి.