మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల తర్వాత ఊహించని ట్విస్టుల నడుమ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కోనుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మూడు కలిసి మహా వికాస్ ఆఘాడి కూటమిగా ఏర్పాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనసభలో బలనిరూపణ చేసుకోవాలని ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు డిసెంబర్ 3 వరకు గడువు ఇచ్చారు.
అయితే శనివారం మెజార్టీ నిరుపుణకు ఉద్ధమ్ సిద్ధంగా ఉన్నారు. శనివారం మధ్యాహ్నం ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధంగా ఉన్నారు. ప్రొటెం స్పీకర్‌గా ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్‌ను కొత్త నియమించారు. గతంలో దీలీస్ వాల్సే సభాధిపతి చేసిన అనుభవం ఉంది. బీజేపీ ప్రభుత్వం నియమించిన ప్రొటెం స్పీకర్ కాళిదాసు కొలాంబ్కర్ తప్పుకోని దీలీప్ బాద్యతలు అప్పగించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 288 స్థానాల్లో శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది ఎమ్మెల్యేల సంఖ్య అవసరం.