మహారాష్ట్ర : ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పయనిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా డిసెంబర్‌ ఒకటిన ముంబైలోని శివాజీ పార్క్‌లో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Update: 2019-11-26 15:22 GMT
Uddhav Thackeray

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పయనిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా డిసెంబర్‌ ఒకటిన ముంబైలోని శివాజీ పార్క్‌లో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేయనున్నారు. బలపరీక్షకు ముందే బీజేపీ చేతులెత్తేయడంతో ముంబైలో సమావేశమైన శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ కూటమి నేతగా ఉద్ధవ్ ఠాక్రే‌ను ఎన్నుకున్నారు. డిసెంబర్ ఒకటిన శివాజీ పార్క్‌లో ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం చేయనున్నట్లు కూటమి నేతలు ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే‌ డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ కాంగ్రెస్ లీడర్‌ బాలా సాహెబ్‌ థోరాట్‌ ప్రమాణం చేయనున్నారు.

సమావేశం ముగిసిన తర్వాత, మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమి నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. ఉద్ధవ్ ఠాక్రే‌కు మద్దతుగా శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను గవర్నర్‌కు అందజేయనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరనున్నారు.

ఇక, గవర్నర్ ఆదేశాలతో మహారాష్ట్ర అసెంబ్లీ రేపు ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఉదయం 8గంటలకు ప్రారంభంకానున్న సభ ఎమ్మెల్యేల ప్రమాణం తర్వాత ముగియనుంది. ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కోలాంబ్కర్ నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు.

Tags:    

Similar News