Himachal Brothers: ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అన్నదమ్ములు
Himachal Brothers: హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో అద్భుతమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అక్కడి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.
Himachal Brothers: ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అన్నదమ్ములు
Himachal Brothers: హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో అద్భుతమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అక్కడి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
సిర్మౌర్ జిల్లాలోని షిల్లాయ్ గ్రామానికి చెందిన ప్రదీప్, కపిల్ అనే అన్నదమ్ములు – హత్తి అనే గిరిజన తెగకు చెందారు. హత్తి తెగలో ప్రత్యేకమైన ఆచారం ప్రకారం అన్నదమ్ములు ఒకే మహిళను వివాహం చేసుకోవచ్చు. ఈ సంప్రదాయం అక్కడ ‘జోడీదర’ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆచారాన్ని అక్కడి రెవెన్యూ చట్టాలు కూడా గుర్తించాయి.
ప్రదీప్ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు, కపిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి షిల్లాయ్ సమీపంలోని కున్హత్ గ్రామానికి చెందిన సునీత చౌహాన్ అనే యువతిని వివాహం చేసుకున్నారు. వివాహం మూడు రోజులపాటు – జూలై 12 నుంచి 14 వరకు సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వేడుకకు భారీగా అతిథులు హాజరయ్యారు.
ప్రదీప్ మాట్లాడుతూ – “మేము మా తెగ ఆచారాన్ని గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది మేం ఇద్దరం కలసి తీసుకున్న నిర్ణయం. మా సంప్రదాయం మీద మాకు గర్వంగా ఉంది,” అని తెలిపారు. మరోవైపు, సునీత మాట్లాడుతూ – “ఆ అన్నదమ్ముల మధ్య బంధం నన్ను ఆకట్టుకుంది. ఎలాంటి ఒత్తిడిలేకుండా ఈ పెళ్లికి అంగీకరించాను,” అని అన్నారు.
ఈ తెగకు చెందినవారు సిర్మౌర్ జిల్లాలోని సుమారు 450 గ్రామాల్లో నివసిస్తున్నారు. మొత్తం మూడు లక్షల మంది ఈ హత్తి తెగలో సభ్యులుగా ఉన్నారు. వందల ఏళ్లుగా కొనసాగుతున్న జోడీదర సంప్రదాయాన్ని ఇప్పటికీ నమ్మకంగా పాటిస్తున్నారు.