Train: కదులుతున్న రైలు నుంచి జవాన్‌ను తోసేసిన టీటీఈ
Train: జవాన్ కాలును కోల్పోయినట్లు తెలిపిన వైద్యులు
Train: కదులుతున్న రైలు నుంచి జవాన్‌ను తోసేసిన టీటీఈ
Uttar Pradesh: టికెట్ విషయంలో తలెత్తిన వివాదంతో ఓ సైనికుడిని కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశాడు TTE. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బరేలీ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. భారత సైన్యంలో పనిచేసే సోనూ.. దిబ్రుఘడ్-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో TTE అక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య టికెట్ విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అదికాస్తా గొడవగా దారితీసింది. ఈ క్రమంలో కోపానికి TTE… సైనికుడు సోనూను కదులుతున్న ట్రైన్‌లో నుంచి ఒక్కసారిగా కిందకు తోసేశాడు. ప్రమాదంలో సోనూకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సోనూను చికిత్స నిమిత్తం ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో సోనూ తన కాలిని కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.