కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు..

జన గణన ద్వారా దేశానికి ఎంతో మేలు జరగుతుందని మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ తెలిపారు.

Update: 2019-12-24 12:27 GMT
Javadekar

జన గణన ద్వారా దేశానికి ఎంతో మేలు జరగుతుందని మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ తెలిపారు. ప్రధానంగా సంక్షేమ పథకాల అసలైన లబ్దదారులు వెలుగులోకి వస్తారని తద్వారా లబ్దిదారులకు మేలు కలగనుందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఆర్‌ ఆమోదం, పలు కీలక అంశాలపై సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. జనాభా నమోదుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంగీకరిచాయని తెలిపారు. 2010లో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దీన్ని ప్రవేశ పెట్టారని, అప్పుడే తొలి కార్డును జారీ చేశారని వెల్లడించారు. రక్షణ చట్టంలో సవరణలు చేసినట్టు తెలిపారు.

2021 ఫిబ్రవరి నుంచి 16వ జనాభా గణణ ఉంటుందని తెలిపారు. జన గణన కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్‌ ఆప్‌ యాప్‌ను తీసుకువస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ యాప్‌ ద్వారా ప్రజలు వివరాలను నమోదు చేయవచ్చని, స్వయం ప్రకటిత వివరాల ఆధారంగానే జన గణణ ఉంటుందని జవదేకర్ వివరించారు.

జన గణనకు ఎలాంటి ధృవీకరణ పత్రాలు, బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదని మంత్రి వివరించారు. దీంతో సంక్షేమ పథకాల అసలైన లబ్దదారులు గుర్తిస్తామని తెలిపారు. అటల్‌ యోజనకు ఆమోదం తెలిపడం, ఆయుధాల చట్టంలో సవరణలు తదితర విషయాల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వివరించారు. టూరిజం విభాగం అభివృద్ధిపై మరింత దృష్టిపెట్టినట్టు జవదేవకర్ వివరించారు. హిమాలయా, నార్త్‌ఈస్ట్‌, కృష్ట, కోస్టల్‌, ఇకో, డిజర్ట్‌, తీర్థాంకర్‌, రామాయణ తదితర 16 సర్క్యూట్స్‌ ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.

ఒక మనిషికి రెండు లైసెన్స్‌ కలిగిన ఆయుధాలకు అనుమతి ఇస్తున్నాట్టు ఆయన తెలిపారు. గతంలో మూడు ఆయుధాలు ఉండేవి అయితే తర్వాతి కాలంలో ఒక లైసెస్స్ ఆయుదం మాత్రమే కలిగి ఉండేది. అయితే తాజాగా దానిని రెండు ఆయుధాలకు అనుమతి ఇస్తూ చట్టంలో సవరణలు చేసినట్లు వెల్లడిచారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నిర‌్ణయానికి ప్రభుత్వం అనుమతి గురించి తెలిపారు. రైల్వే బోర్డు పునర్నిర్మాణంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని 8 రైల్వే సేవలను ఐఆర్‌ఎంఎస్‌ జాబితాలోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి జవదేవకర్ వెల్లడించారు.



 

Tags:    

Similar News