Tomato Price: దేశవ్యాప్తంగా చుక్కలు చూపిస్తున్న టమాట ధరలు.. కొనాలంటేనే భయపడుతున్న జనాలు

Tomato Price: రికార్డు స్థాయికి చేరిన టమాట ధర

Shekhar G
Published on: 5 July 2023 2:51 PM IST
Tomato Price Hike in India
X

Tomato Price: దేశవ్యాప్తంగా చుక్కలు చూపిస్తున్న టమాట ధరలు.. కొనాలంటేనే భయపడుతున్న జనాలు

Tomato Price: ప్రస్తుతం కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అందులో టమాట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టమాట ధర రికార్డు స్థాయికి చేరడంతో సాధారణ ప్రజలు వాటిని కొనాలంటేనే భయపడుతున్నారు. దేశవ్యాప్తంగా కిలో టమాట ధర 58 నుంచి 148 రూపాయలు పలుకుతుంది. అయితే పశ్చిమబెంగాల్‌లోని పురులియా ప్రాంతంలో మాత్రం అత్యధికంగా టమాట ధర 155కు చేరింది. ఎండల తీవ్రత పెరగడం, రుతుపవనాల రాక ఆలస్యమవడంతో టమాటా ఉత్పత్తి తగ్గిపోయిందని మంత్రిత్వశాఖ వెల్లడించింది.

కాగా, ముంబైలో అతితక్కువగా కిలో 58 రూపాయలు పలుకుతుండగా, ఢిల్లీలో 110, చెన్నైలో 117, కోల్‌కతాలో 148కి చేరిందని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా 83 రూపాయలకు దొరుకుతుందని తెలిపింది. అయితే ప్రాంతాన్ని, అమ్మకపుదారులను బట్టి 120 నుంచి 140 వరకు ధర పలుకుతుందని మంత్రిత్వశాఖ చెప్పింది. ఢిల్లీలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, బ్లిన్‌కిట్‌ వంట్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ అప్లికేషన్స్‌‌లో కిలో 140 రూపాయలకు అమ్ముతున్నాయని వెల్లడించింది. ప్రస్తుత సీజన్‌ కారణంగా ధరలు అమాంతం పెరిగిపోయాయని, మరో 15 నుంచి నెల రోజుల్లో అవి దిగివచ్చే అవకాశం ఉందని తెలిపింది.

Shekhar G

Shekhar G

Next Story