Bengal: ఇవాళ పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోడీ పర్యటన

Bengal: కోల్‌కతాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోడీ * ప.బెంగాల్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ

Update: 2021-03-07 03:57 GMT

పీఎం మోడీ (ఫైల్ ఇమేజ్)

Bengal: మరో ఇరవై రోజుల్లో నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై రాజకీయ విశ్లేషకులతో పాటు సాధారణ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు వరుసగా విజయం సాధించిన దీదీ.. ఈ ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలనే ధృఢ సంకల్పంతో ఉన్నారు. మరోవైపు.. ఎలాగైనా బెంగాల్‌లో కాషాయ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో వ్యూహం రచిస్తోంది బీజేపీ.

దేశంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదింటిలో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలను కమలం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గెలుపు కోసం రెండేళ్ల ముందు నుంచే వ్యూహాలకు పదునుపెట్టింది. టీఎంసీలోని కీలక నేతలను చేర్చుకోవడంతో పాటు బీజేపీ ముఖ్యనేతలతో ఆ రాష్ట్రంలో పర్యటనలు ప్లాన్‌ చేసింది బీజేపీ అధిష్ఠానం. దీంతో బెంగాల్ ఎన్నికలు దేశమంతా హాట్‌ టాపిక్‌గా మారాయి. ‎

ఇందులో భాగంగా.. ఇవాళ పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. కోల్‌కతాలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. మోడీ పర్యటన సందర్భంగా దాదాపు 7 లక్షల మందితో కవాతు ప్లాన్‌ చేసింది కమలం పార్టీ. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ ర్యాలీ సక్సెస్‌ అయితే.. రాష్ట్రంలో తమ పార్టీ వేవ్‌ క్రియేట్‌ అవుతుందని భావిస్తున్నారు కమలనాథులు. ఈ ఎన్నికల్లో తృణమూల్‌ను ఓడించి బీజేపీ వ్యతిరేక విపక్షాల్లో కీలకంగా ఉన్న ఆ పార్టీ ప్రభావాన్ని తగ్గించాలని బీజేపీ భావిస్తోంది.

ఇక కోల్‌కతాలో బీజేపీ ర్యాలీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు మమతా బెనర్జీ. మోదీ 30 ర్యాలీలు కాకుంటే 120 ర్యాలీలు నిర్వహించుకున్నా తనకు నష్టం లేదని అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ర్యాలీలు తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. ఎన్నికలు 8 విడతల్లో కాకుంటే 294 విడతల్లో నిర్వహించండని పరోక్షంగా ఈసీని టార్గెట్‌ చేస్తూ కామెంట్స్‌ చేశారు దీదీ.

Full View


Similar News