Karni Sena Chief Murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
Karni Sena Chief Murder: రోహిత్ రాథోడ్, ఉధమ్‌లను ఢిల్లీ తరలించిన పోలీసులు
Karni Sena Chief Murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
Karni Sena Chief Murder: రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అర్ధరాత్రి ఛండీగఢ్‌లో ఇద్దరు షూటర్లు, వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భాగంగా నిందితుల ఆచూకీపై సమాచారం అందడంతో ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, రాజస్థాన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఇద్దరు హంతకులు జైపూర్‌కు చెందిన రోహిత్ రాథోడ్, హర్యానాకు చెందిన నితిన్ ఫౌజీగా నిర్ధారించారు. వీరికి సహకరించిన మూడో వ్యక్తి పేరు ఉధమ్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. రోహిత్, ఉధమ్‌లను పోలీసులు ఢిల్లీకి తీసుకెళ్లారు. నితిన్ ఫౌజీ... రాజస్థాన్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
హత్య చేసిన తర్వాత నిందితులు తమ ఆయుధాలను దాచిపెట్టి రాజస్థాన్ నుంచి హర్యానాలోని హిసార్ చేరుకున్నారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి వెళ్లి అక్కడ నుంచి చండీగఢ్‌కు తిరిగొచ్చి పోలీసులకు దొరికిపోయారు. నిందితులను సోమవారం కోర్టు ముందు హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది. ఈ హత్యకు సంబంధించి రామ్‌వీర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు శనివారం అరెస్ట్ చేయడంతో.. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు అరెస్ట్ అయ్యారు. సుఖ్‌దేవ్ సింగ్‌ను హత్య చేసేందుకు ముష్కరులతో ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆరోపణలతో జైపూర్‌లో రామ్‌వీర్ జాట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
జైపూర్‌లో ఈనెల 5న సుఖ్‌దేవ్ సింగ్‌ను తన ఇంట్లో నలుగురు వ్యక్తులతో మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాంతో ఆయన రక్తపుమడుగులో అచేతనంగా పడిపోయారు. క్రాస్‌ఫైర్ సమయంలో మరణించిన మూడో షూటర్‌ను నవీన్ సింగ్ షెకావత్‌గా పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల్లో గోగమేది బాడీగార్డ్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు.