ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి బెదిరింపులు

సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు గోయల్ అరెస్ట్

Update: 2024-05-22 09:39 GMT

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి బెదిరింపులు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని చంపుతామని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అంకిత్ గోయల్ అనే వ్యక్తి మెట్రో గోడలపై కేజ్రీవాల్‌ని హత్య చేస్తామంటూ రాశాడు. అందుకు సంబంధించిన దృశ్యం సీసీ కెమెరాలో రికార్డు అయింది. మే 19న పటేల్ నగర్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లలో కేజ్రీవాల్ గురించి ఇంగ్లీష్‌లో గోయల్ బెదిరింపు సందేశాన్ని రాశాడు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అంకిత్ గోయల్‌ వెనక బీజేపీ ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.

Tags:    

Similar News