శ్రీ రంగం రంగనాథ స్వామి ఆలయంలో తప్పిన పెను ప్రమాదం.. రాజగోపురం నుంచి పెచ్చులూడి క్రిందపడ్డ శిధిలాలు
Tamilnadu: రాజగోపురంలో భారీగా ఏర్పడిన పగుళ్లు
శ్రీ రంగం రంగనాథ స్వామి ఆలయంలో తప్పిన పెను ప్రమాదం.. రాజగోపురం నుంచి పెచ్చులూడి క్రిందపడ్డ శిధిలాలు
Tamilnadu: దక్షిణ భారత దేశంలో పవిత్రపుణ్యక్షేత్రం.. శ్రీరంగం రంగనాథుని ఆలయంలో పెనుప్రమాదం తప్పింది. పురాతన కాలంనాటి ఆలయ కట్టడంలో రాజగోపురం దెబ్బతింది. తూర్పుద్వారం రాజగోపురం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మెట్లకు పగుళ్లు రావడంతో అర్ధరాత్రి కుప్పకూలింది. నిత్యంరద్ధీగా ఉండే రంగనాథుని ఆలయ పరిసరాల్లో అర్థరాత్రి దాటిన తర్వాత రాజగోపురం కుప్పకూలడంలో పెనుప్రమాదం తప్పిందని ఆలయ వర్గాలు అభిప్రాయం వ్యక్తంచేశాయి.
కొద్దిరోజుల క్రితమే ఆలయ తూర్పు ప్రవేశద్వారానికి పగుళ్లు ఏర్పడ్డాయని ఆలయాధికారులు గుర్తించినప్పటికీ.. మరమ్మతుల విషయంలో తాత్సారం చేశారు. దీంతో రాజగోపురం కుప్పకూలిన విషయం తెలుసుకున్న ఆలయాధికారులు త్వరితగతిన శిథిలాలను తొలగించే ప్రయత్నం చేశారు.