Priyanka Gandhi: నీట్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయి
Priyanka Gandhi: ఒకే కేంద్రంలో ఆరుగురికి 720 మార్కులు వచ్చాయి అనుమానాలను నివృత్తి చేయాలి
Priyanka Gandhi: నీట్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయి
Priyanka Gandhi: నీట్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. దీనిపై వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. తొలుత నీట్ ప్రశ్నాపత్రం లీకైందన్న ఆమె... ఇప్పుడు ఫలితాల్లోనూ కుంభకోణం జరిగినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ఆమె చెప్పారు. వీటన్నింటినీ నివృత్తి చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.