Coronavirus: దేశంలో 2500కు చేరువలో మరణాలు.. రికవరీలు ఎక్కువే..
బుధవారం విడుదల చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఇండియాలో కేసులు 74,000 ను దాటాయి.
బుధవారం విడుదల చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఇండియాలో కేసులు 74,000 ను దాటాయి.. అయితే covid19india.org ప్రకారం భారత్ లో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 74 వేల 997 కు చేరుకుంది. గత 24 గంటల్లో, 41 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది, 13 మంది బిఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. మంగళవారం, 3610 మంది నివేదికలు పాజిటివ్ గా వచ్చాయి. గత 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 1900 మంది రోగులు కరోనా బారినుంచి కోలుకున్నారు. అంతకుముందు మే 10న 1669 మంది కోలుకొని దేశంలోని వివిధ ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు.
అదేవిధంగా బుధవారం ఢిల్లీలో 359 కొత్త కేసులు వచ్చాయి. పైన చెప్పిన గణాంకాలు covid19india.org, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ఉన్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో 74 వేల 281 మందికి కరోనా సోకినట్లు తెలిపింది. ఇందులో 24 వేల 386 మందికి నయం కాగా.. 2415 మంది రోగులు మరణించారు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 47 వేల 480 మంది చికిత్స పొందుతున్నారు.