Etela Rajender: 6 నెలల్లోనే ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని తిరస్కరించారు
Etela Rajender: ఎన్నికల కోసం కష్ట పడ్డ బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు
Etela Rajender: 6 నెలల్లోనే ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని తిరస్కరించారు
Etela Rajender: 6 నెలల్లోనే తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిరస్కరించారని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో బీజేపీ ఉండాలని ప్రజలు కోరుకున్నారన్నారు. ఎన్నికల కోసం కష్ట పడ్డ బీజేపీ కార్యకర్తలకు ఈటల ధన్యవాదాలు తెలిపారు. కులాలు, జెండాలతో సబంధం లేకుండా బీజేపీని గెలిపించారన్నారు. ప్రలోభాలను, డబ్బులనే కాంగ్రెస్ నమ్ముకుందని, అయినా బీజేపీకి 8 సీట్లు వచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డ మీద ఎగిరేది కాషాయ జెండా అని ఈటల ధీమా వ్యక్తం చేశారు. తమ మీద పెట్టిన నమ్మకం, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామన్నారు.