చెన్నై కళాక్షేత్ర పౌండేషన్ వద్ద ఉద్రిక్తత
* రుక్మిణిదేవి కాలేజ్ ఆవరణలో నిరసన చేపట్టిన విద్యార్దులు
చెన్నై కళాక్షేత్ర పౌండేషన్ వద్ద ఉద్రిక్తత
Chennai: చెన్నైలోని కళాక్షేత్ర పౌండేషన్‌కు చెందిన రుక్మిణిదేవి కాలేజ్‌ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమపై లైంగిక వేదింపులకు పాల్పడిన నలుగురు అధ్యాపకులను బహిష్కరించాలని కాలేజ్ ఆవరణలో విద్యార్దులు బైటాయించారు.తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ విద్యార్దులతో పాటు,వారి తల్లిదండ్రులు కూడా నిరసన చేపట్టారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని నిరసన అదుపుచేశారు. ఈ విషయంపై స్పందించిన పౌండేషన్ సభ్యులు వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.