ISRO: ఇస్రో బాహుబలి రాకెట్ విజయం బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి

ఇస్రో మరో బాహుబలి ప్రయోగం ఎల్వీఎం-3 బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం నింగిలోకి బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం USకి చెందిన బ్లూబర్డ్‌ బ్లాక్-2 ఉపగ్రహాం

Update: 2025-12-24 05:45 GMT

ISRO: ఇస్రో బాహుబలి రాకెట్ విజయం బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి

ఇస్రో మరోసారి తన సత్తా చాటింది. భారీ ఉపగ్రహాల ప్రయోగంలో కీలకమైన ఎల్వీఎం-3 (బాహుబలి) రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతంగా చేర్చింది.

ఈ ఉపగ్రహాన్ని AST స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడమే ఈ ఉపగ్రహం ప్రధాన లక్ష్యం. సుమారు 6.40 టన్నుల బరువు కలిగిన భారీ శాటిలైట్‌ను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన LVM3-M6 బాహుబలి రాకెట్ ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించింది.

మూడు దశల్లో సాగిన ఈ రాకెట్ ప్రయోగం కేవలం 15 నిమిషాల్లోనే పూర్తయింది. ఇది ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో వందో ప్రయోగం కావడం విశేషం. అంతేకాదు, తొలిసారిగా ఇంత భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపడంలో ఇస్రో పూర్తిగా విజయం సాధించింది.

ఈ విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ స్థానం మరింత బలపడింది. ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. మరోసారి ప్రపంచానికి భారత అంతరిక్ష సామర్థ్యాన్ని చాటి చెప్పిన ఇస్రోకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

Tags:    

Similar News