Heat Wave: పలు రాష్ట్రాల్లో ఇప్పటికే 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు
Heat Wave: నాగ్‌పూర్‌లో అత్యధికంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Summer Heat Alert: భగభగ మండుతున్న సూర్యుడు.. తెలుగు రాష్ట్రాలకు హీట్ అలర్ట్
Heat Wave: ఉత్తరాది రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాయి. సమ్మర్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటేశాయి. రెండు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలోని మంగేష్‌పూర్‌లో 52.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ మహారాష్ట్రలో ఆ రికార్డును దాటేస్తూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాగ్‌పూర్‌లో అత్యధికంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గడిచిన 24 గంటల్లో వడదెబ్బతో పలు రాష్ట్రాల్లో 54మంది ప్రాణాలు కోల్పోయారు. బిహార్‌లో అత్యధికంగా 32మంది చనిపోగా... ఒడిశాలో 10, జార్కండ్‌లో 5, రాజస్తాన్‌లో 5, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు, ఢిల్లీలో ఒకరు మరణించారు.