ఇవాళ ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
Congress: రేపు ఉదయం 11 గంటలకు రాహుల్‌తో భేటీ
ఇవాళ ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. పొంగులేటి, జూపల్లికి రాహుల్ అపాయింట్‌మెంట్ ఖరారయ్యింది. రేపు ఉదయం 11 గంటలకు రాహుల్‌తో భేటీ కానున్నారు. ఖర్గే, ప్రియాంకతో పాటు కేసీ వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. జూపల్లి వెంట 10 మంది, పొంగులేటి వెంట 40 మంది బృందం ఢిల్లీ వెళ్లనున్నారు. తాజా చేరికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలకు కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై రాహుల్ సీనియర్లతో చర్చించనున్నారు. కొత్త పాత నేతలను సమన్వయం చేయనున్న పార్టీ హైకమాండ్.