ఇదే కదా ప్రేమంటే ... భార్య చికిత్స కోసం 130 కిమీ సైకిల్ తొక్కాడు..

ప్రేమకి ఏది అడ్డురాదు అని చెప్పేందుకు మరో ఉదాహరణగా నిలిచింది ఈ సంఘటన..

Update: 2020-04-11 09:56 GMT
Arivalagan, Manjula

ప్రేమకి ఏది అడ్డురాదు అని చెప్పేందుకు మరో ఉదాహరణగా నిలిచింది ఈ సంఘటన.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. బయటకు వెళ్లలేని పరిస్థితి .. ఆపద ఉన్న కానీ బయట వాహనాలు నడవలేని దుస్థితి.. కానీ ఈ సమయంలో లాక్ డౌన్ ని లెక్కచేయకుండా ప్రేమకి ఏది అడ్డురాదు అని నిరూపించాడు ఓ భర్త.. కట్టుకున్న భార్య మీదా ఉన్న ప్రేమతో ఆమె కోసం 120 కి.మీ సైకిల్ పై ప్రయాణం చేశాడు.. అతని మంచి యుక్త వయసులో ఉంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కరలేదు. కానీ అతని వయసు 65 ఏళ్ళు.. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఎం జరిగింది అంటే..!

తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన అరివలగన్‌ (65) అనే రైతు భార్య మంజుల(60) .. ఆమె భార్య గత కొంతకాలంగా క్యాన్సర్‌తో కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. ఆమె జిప్మర్‌లో చికిత్స పొందుతుంది. తరచూ ఆమెకు కీమో థెరపీ అందించవలసి ఉంది. రెండు సెషన్లు పూర్తి కాగా, మూడో సెషన్‌కు మార్చి 31న రావాలని వైద్యులు సూచించారు..కానీ అప్పటికే లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దీనితో వాహనాలు లేని పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో తెలియక మార్చి 30న రాత్రి సైకిల్‌పై భార్యతో కలిసి బయలుదేరాడు. 130 కిమీ.ల దూరం ప్రయాణం చేసి వైద్యులు చెప్పిన సమయానికి ఆస్పత్రికి చేరుకున్నారు.

అంతదూరం నుంచి ఆసుపత్రికి చేరుకున్నప్పటికి వైద్యులు ముందుగా ఆమెకి చికిత్స చేయడానికి నిరాకరించారు. కానీ అతను ఇక్కడికి ఎలా వచ్చాడో చెప్పాక ఆతని దుస్థితిని అర్ధం చేసుకొని కీమో థెరపీ ని నిర్వహించారు. అనంతరం.. అంబులెన్స్‌లో కుంభకోణంకు వారిని పంపించారు. ఇంత బలహీనంగా ఉన్న అరివలగన్‌ అన్ని కిలోమీటర్ల సైకిల్ ఎలా తొక్కాడు అన్నది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Tags:    

Similar News