వివాదంలో తమిళనాడు తిండివనం మున్సిపాలిటీ కౌన్సిలర్

Tamil Nadu: తమిళనాడు తిండివనం మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్ వివాదంలో చిక్కుకున్నారు.

Update: 2025-09-03 08:26 GMT

Tamil Nadu: తమిళనాడు తిండివనం మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఉద్యోగి కౌన్సిలర్ రమ్య కాళ్లు మొక్కడంతో.. ఉద్యోగులను కౌన్సిలర్ వేధించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

తిండివనం మున్సిపాలిటీలో కౌన్సిలర్లు అంతా కలిసి ఉద్యోగిని వేధించారని బీజేపీ నేత అన్నామలై ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులను అవమానించడం డీఎంకేకు పరిపాటి అని.. గతంలోనూ ఇలాంటి ఘటనలు చూశామని పేర్కొన్నారు. డీఎంకే చెబుతున్న సామాజిక న్యాయం ఇదేనా అని ప్రశ్నించారు.



Tags:    

Similar News