చిదంబరం బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

-చిదంబరం బెయిల్‌ పిటిషన్‌పై ఈడీకి నోటీసులు జారీ -తదుపరి విచారణ నవంబరు 26కు వాయిదా

Update: 2019-11-20 07:44 GMT
Chidambaram

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. చిదంబరం బెయిల్‌ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలంటూ ఈడీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరు 26కు వాయిదా వేసింది.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీ లాండరింగ్‌ కేసులో చిదంబరం బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల తిరస్కరించింది. అంతేగాక.. ఆయన జ్యుడిషియల్‌ రిమాండ్‌ని కూడా ఈ నెల 27వరకు పొడిగించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత 90 రోజులకు పైగా చిదంబరం జైల్లోనే ఉన్నారని, వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపి.. ఈడీకి నోటీసులు జారీ చేసింది. 

Tags:    

Similar News