సుప్రీం కోర్టు ఉద్యోగుల కీలక నిర్ణయం

భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని.. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి.

Update: 2020-03-23 07:56 GMT
supreme Court

భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని.. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలో మార్చి 22 నుంచి 31 వరకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అవసరమైన సేవలను మినహాయించి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్వయంప్రతిపత్త సంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రైవేట్ కార్యాలయాలు, మాల్స్, దుకాణాలు, కర్మాగారాలు, గోడౌన్లు మరియు ప్రజా రవాణా ఈ ప్రాంతాల్లో మూసివేశారు.

ఈ నేపథ్యంలో మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పనిచేయకూడదని సుప్రీంకోర్టు లాయర్స్ అసోసియేషన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈలోపు ఎవరూ కూడా కేసులను వాదించకూడదని నిర్ణయించింది. కరోనా ఉదృతి తరుణంలో బార్‌ అసోసియేషన్‌ సభ్యుల తోపాటు ఇతర ఉద్యోగులు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ఆరోగ్యం, భద్రత దృష్ణా చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించిన విషయం విదితమే.

Tags:    

Similar News