సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎస్ఏ బాబ్డే ప్రమాణం

-ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ -2021 ఏప్రిల్‌ 23న పదవీ విరమణ చేయనున్న బాబ్డే

Update: 2019-11-18 04:55 GMT
supreme Court Justice Sharad Arvind Bobde was sworn

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా శరద్‌ అర్వింద్‌ బాబ్డే ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్‌ బాబ్డే చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేయించారు. 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్‌ బాబ్డే.. 2021, ఏప్రిల్‌ 23 వరకు కొనసాగనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, జస్టిస్‌ ఎన్వీ రమణ, మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గోగోయ్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డేకు రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతితో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

1978 లో మహారాష్ట్రలోని బార్ కౌన్సిల్‌లో చేరారు. జస్టిస్‌ బోబ్డే మార్చి 29, 2000 బాంబే హైకోర్టులో పనిచేశారు. అక్టోబర్ 16, 2012 న మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. తర్వాత 2013 ఏప్రిల్‌ 12న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్‌ బోబ్డే సీనియర్‌ న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం 18 నెలల్లో ముగియనున్నది. అయోధ్య కేసుతోపాటు ఆర్టికల్‌ 370 కేసుతోపాటు పలు కీలక కేసులు విచారణ చేశారు.  

ఇదే వార్తను ఇంగ్లీషులో చదవేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News