Supreme Court: మెడికల్ సీట్ల ఖాళీలపై సుప్రీంకోర్టు అసహనం

Supreme Court: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రం కలిసి..విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయన్న సుప్రీంకోర్టు

Update: 2022-06-08 10:12 GMT

Supreme Court: మెడికల్ సీట్ల ఖాళీలపై సుప్రీంకోర్టు అసహనం

Supreme Court: మెడికల్ సీట్ల ఖాళీలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 1,456 మెడికల్ సీట్లు ఖాళీ ఉండటంపై అసంతృప్తి చెందిన సుప్రీంకోర్టు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రం కలిసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021-22లో మిగిలిపోయిన సీట్లకు తదుపరి కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంపై మండిపడింది సుప్రీంకోర్టు. విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకపోతే వారికి పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. రేపు కోర్టులో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ అధికారులు హాజరుకావాలని సూచించింది.

Tags:    

Similar News