Supreme Court: లఖీంపూర్‌ఖేరి ఘటన నివేదికపై సుప్రీంకోర్టు అసంతృప్తి

*పోలీసుల తీరుపై సీజేఐ ఆగ్రహం *కేంద్ర మంత్రి కొడుకును ఎందుకు అరెస్ట్ చేయలేదన్న కోర్టు

Update: 2021-10-08 09:49 GMT

సుప్రీం కోర్ట్ (ఫైల్ ఫోటో)

Supreme Court: లఖీంపూర్‌ఖేరి ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై యూపీ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. పోలీసుల తీరుపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కొడుకును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. మీరు కావాలనుకుంటే సీబీఐకి బదిలీ చేసుకోవచ్చన్న సుప్రీంకోర్టు ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై అంసతృప్తి వ్యక్తం చేసింది.

ఎనిమిది మంది మరణించిన లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదని స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే హాజరయ్యారు. ఈకేసులో సాక్ష్యాలను భద్రపరిచేందుకు రాష్ట్రంలోని అత్యున్నత పోలీసు అధికారికి సమాచారం ఇస్తామని హామి ఇచ్చినట్టు సుప్రీం పేర్కొంది. లఖీంపూర్ ఘటనపై విచారణ నిర్వహించగల ప్రత్యామ్నాయ ఏజెన్సీ వివరాలను తెలియజేయాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. 

Tags:    

Similar News