మ‌హారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‎కు సుప్రీం షాక్ !

అక్టోబర్‎లో మ‌హారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ‌్యమంత్రి దేవేంద్ర ఫ‌డ్నవీస్‌కు సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది.

Update: 2019-10-01 07:23 GMT

అక్టోబర్‎లో మ‌హారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ‌్యమంత్రి దేవేంద్ర ఫ‌డ్నవీస్‌కు సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో క్రిమిన‌ల్ కేసుల‌ గురించి వెల్లడించ‌క పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులులో విచారణ చేపట్టాని పేర్కొంది. మ‌హారాష్ట్రకు చెందిన స‌తీశ్ సీఎం ఫ‌డ్నవీస్‌పై కేసు దాఖ‌లు చేశారు.2014 ఎన్నికల్లో సీఎం ఫ‌డ్నవీస్‌పై క్రిమిన‌ల్  పెండింగ్‌లో కేసులు గురించి అఫిడ‌విట్‌లో పేర్కొనలేద‌ని స‌తీశ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బాంబే హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. సెక్షన్ 125 ప్రకారం విచార‌ణ చేప‌ట్టాల‌ని ఇవాళ సుప్రీం కోర్టు ఆదేశించింది. రంజ‌న్ గ‌గోయ్‌తో పాటు జ‌స్టిస్ దీప‌క్ గుప్తా, జ‌స్టిస్ అనిరుధ్ బోస్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తీర్పు వెలువడించింది.

Tags:    

Similar News