Supreme Court: 12 ఏళ్ల చిన్నారి కథ విని కదిలిన న్యాయస్థానం… తప్పును అంగీకరించి తీర్పు మార్చిన సుప్రీంకోర్టు

దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఓ హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. 12 ఏళ్ల చిన్నారి మనసు కదిలించే కథ విన్న సుప్రీంకోర్టు తన పూర్వ తీర్పునే మార్చుకుంది.

Update: 2025-07-17 13:19 GMT

Supreme Court: 12 ఏళ్ల చిన్నారి కథ విని కదిలిన న్యాయస్థానం… తప్పును అంగీకరించి తీర్పు మార్చిన సుప్రీంకోర్టు

దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఓ హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. 12 ఏళ్ల చిన్నారి మనసు కదిలించే కథ విన్న సుప్రీంకోర్టు తన పూర్వ తీర్పునే మార్చుకుంది. తల్లిదండ్రుల మధ్య వివాదాల కారణంగా మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్న బాలుడి సంరక్షణ బాధ్యతను తిరిగి తల్లికే అప్పగిస్తూ, గత తీర్పు తప్పని అంగీకరించింది. జస్టిస్ విక్రమ్ నాథ్ మరియు జస్టిస్ ప్రసన్న బి. వరలేల నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.

ఏం జరిగింది..?

కేరళకు చెందిన ఓ జంట 2011లో వివాహం చేసుకుంది. 2012లో వీరికి బిడ్డ పుట్టాడు.

వివాహ సమస్యల కారణంగా 2015లో వీరు విడాకులు తీసుకున్నారు. బిడ్డను తల్లిదగ్గరే ఉంచి, తండ్రి నెలలో రెండుసార్లు మాత్రమే చూడటానికి అనుమతించేలా ఒప్పందం కుదిరింది.

తరువాత తల్లి రెండో పెళ్లి చేసుకుని మలేషియాకు వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనిపై తండ్రి అభ్యంతరం వ్యక్తం చేసి కుటుంబ కోర్టులో పిటిషన్ వేశాడు.

2022లో కుటుంబ కోర్టు బిడ్డను తల్లిదగ్గరే ఉంచింది, కానీ కేరళ హైకోర్టు ఆ తీర్పును తిరస్కరించి బిడ్డను తండ్రికే అప్పగించింది.

2024లో సుప్రీంకోర్టు కూడా అదే నిర్ణయాన్ని సమర్థించింది.

చిన్నారి పరిస్థితి కదిలించిన కోర్టు

తల్లి సమీక్ష పిటిషన్ దాఖలు చేస్తూ, బాలుడి మానసిక స్థితి క్షీణించిందని, తండ్రి బెదిరింపుల వల్ల ఆందోళన రుగ్మత తీవ్రతరం అయిందని ఆరోపించింది.

బాలుడు తన తండ్రిని “అపరిచితుడు”గా భావిస్తున్నాడని, ఒక్క రాత్రి కూడా అతని వద్ద గడపలేదని సుప్రీంకోర్టు గుర్తించింది.

ప్రస్తుతం ఆ చిన్నారి వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ సైకియాట్రీ విభాగంలో చికిత్స పొందుతున్నాడు.

తల్లిదగ్గర ఉంటేనే తనకు మానసిక ప్రశాంతత లభిస్తుందని బాలుడు కోర్టులో పేర్కొన్నాడు.

తీర్పు మార్పు

బాలుడి విన్నపం, మానసిక వైద్యుల నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు పూర్వ తీర్పునే సవరించింది. చిన్నారి శ్రేయస్సే ముఖ్యమని భావించిన న్యాయమూర్తులు అతన్ని తిరిగి తల్లిదగ్గరే ఉంచాలని నిర్ణయించి, గతంలో ఇచ్చిన తీర్పు తప్పని అంగీకరించారు.

Tags:    

Similar News