Sunita Kejriwal: కేజ్రీవాల్ కు అండగా నిలబడాలని కోరిన సునీతా కేజ్రీవాల్
Sunita Kejriwal: దేశ ప్రజల ఆశీర్వాదం కావాలన్న సునీత
Sunita Kejriwal: కేజ్రీవాల్ కు అండగా నిలబడాలని కోరిన సునీతా కేజ్రీవాల్
Sunita Kejriwal: దేశంలో అత్యంత అవినీతి, నియంత శక్తులకు వ్యతిరేకంగా తన భర్త పోరాడుతున్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత అన్నారు. ఆయనకు అండగా ఉండేందుకు ప్రజలందరి ఆశీర్వాదం కావాలని కోరారు. ఈ మేరకు మరో వీడియో సందేశం విడుదల చేసిన ఆమె.. వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభించారు. తన భర్త నిజమైన దేశభక్తుడన్నారు. కోర్టులో నిల్చుని నిజానిజాలన్నీ బయటపెట్టాలంటే చాలా ధైర్యం కావాలన్నారు. ప్రస్తుతం ఆయన నియంత శక్తులను సవాల్ చేస్తున్నారని ఆమె అన్నారు. ఇప్పుడు మనమంతా ఆయనకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.