Big Breaking : సూడాన్‌లో భారీ పెలుడు..18 మంది భారతీయులు సజీవదహనం

సూడాన్ దేశం ఓ సెరామిక్స్ ఫ్యాక్టరీలో భారీ పెలుడు సంభవించింది.

Update: 2019-12-04 13:43 GMT
employees of various nationalities, Some from Asian countries Screenshot from REUTERS video

సూడాన్ దేశం ఓ సెరామిక్స్ ఫ్యాక్టరీలో భారీ పెలుడు సంభవించింది. ఈ ఘటనలో 18మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. సూడాన్‌లోని బహ్రీ అనే పట్టణంలో ఈ ఘటన జరిగింది. మంగళవారం కోబర్ నైబర్‌హుడ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని సలోమీ సిరామిక్ ఇండస్ట్రీలో ఓ గ్యాస్‌ ట్యాంకర్‌ పేలడంతో భారీ ప్రమాదం జరిగింది. ఒక్క సారిగా అగ్నికీలకు ఎగిసి పడడంతో 23 మంది సజీవంగా దహనమైయ్యారు. 330 మందికిపైగా తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను అక్కడి ఆసుపత్రికి తరలించారు. ఇంకా దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

ఎంతమంది చినిపోయారనేది అధికారికంగా వెల్లడించలేదు. భారత రాయబార కార్యాలయం 18 మంది భారతీయులు మరణించినట్లు బుధవారం ప్రకటనలో తెలిపింది. మంటల్లో మృతదేహాలు కాలిపోవడంతో వారిని గుర్తిచడం సాధ్యపడలేదని తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారి జాబితాను విడుదల చేసింది. 34 మంది భారతీయులను సురక్షిత పంపించినట్లు తెలిపింది. సెరామిక్స్ ఫ్యాక్టరీలో జాగ్రత్తలు తీసుకోవడంలో ఘోర ప్రమాదం జరిగిందని తెలిపింది. ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారని, 130 మందికి పైగా గాయపడ్డారని ఏఎఫ్‌పీ రిపోర్టులో వెల్లడించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.



 

 

Tags:    

Similar News