రాష్ట్రాల వారీగా కరోనావైరస్ కేసులు, మరణాలు ఇలా ఉన్నాయి

దేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్యను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం అప్‌డేట్ చేసింది.. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 7,447 కేసులు నమోదయ్యాయి.

Update: 2020-04-11 11:53 GMT

దేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్యను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం అప్‌డేట్ చేసింది.. దేశంలో ఇప్పటివరకూ మొత్తం 7,447 కేసులు నమోదయ్యాయి.ఇందులో 239 మరణాలు, వైరస్ నుండి కోలుకున్న 642 మంది ఉన్నారు. దాంతో 6,565 క్రియాశీల కేసులు ఉన్నాయి.. Covid -19 కేసులు తమిళనాడు, ఢిల్లీ లో 900 మార్క్ ను దాటింది, మహారాష్ట్ర ఇప్పుడు 2,000 కేసులకు దగ్గరగా ఉంది. కోవిడ్ -19 మరణాలలో మహారాష్ట్ర అత్యధికంగా ఉంది, ఆ తరువాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, గుజరాత్ ఉన్నాయి.

రాష్ట్రాల వారీగా కరోనావైరస్ క్రియాశీల కేసులు, మరణాలు ఇలా ఉన్నాయి..

మహారాష్ట్ర :

1574 కోవిడ్ -19 క్రియాశీల కేసులతో, మహారాష్ట్ర దేశంలోనే అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ కేసులను నమోదు చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 110 మంది మరణించగా, 188 మంది రోగులు కోలుకున్నారు.

తమిళనాడు :

దేశంలో అత్యధికంగా కోవిడ్ -19 కేసులు ఉన్న రెండవ రాష్ట్రంగా ఉంది, రాష్ట్రంలో మొత్తం 911 కేసులు ఉండగా.. 44 మంది రికవరీ అయ్యారు.. 8 మంది మరణించారు.

ఢిల్లీ :

కరోనావైరస్ కేసులలో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ మొత్తం 903 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 13 మంది సంక్రమణతో మరణించగా, 25 మంది కోలుకున్నారు.

రాజస్థాన్ :

రాజస్థాన్‌లో కరోనావైరస్ కేసులు శనివారం 553 కు చేరుకున్నాయి. రాష్ట్రంలో 3 మరణాలు సంభవించాయి. 21 మంది రోగులు సంక్రమణ నుండి కోలుకున్నారు.

తెలంగాణ :

487 పాజిటివ్ కేసులు రాష్ట్రం నుండి ఇప్పటివరకు నమోదయ్యాయి. వైరస్ నుండి 48 మంది కోలుకోగా, కోవిడ్ -19 నుండి 12 మంది మరణించారు.

మధ్యప్రదేశ్ :

435 కరోనావైరస్ కేసులు ఉన్నాయి.. ఇక్కడ కోవిడ్ -19 ద్వారా 33 మంది మరణించారు.

ఉత్తర ప్రదేశ్ :

రాష్ట్రంలో 431 మందికి కోవిడ్ -19 వ్యాధి సోకింది. 32 మంది కరోనావైరస్ నుంచి కోలుకోగా, 4 మంది ఇక్కడ సంక్రమణతో మరణించారు.

ఆంధ్రప్రదేశ్ :

రాష్ట్రంలో 381 పాజిటివ్ కేసులు ఉండగా.. 7 గురు కోలుకున్నారు. 6 మంది మరణించారు.

కేరళ :

364 కరోనావైరస్ కేసులు ఉన్నాయి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం, కోవిడ్ -19 కారణంగా కేరళలో రెండు మరణాలు సంభవించగా, 123 మంది విజయవంతంగా కోలుకున్నారు.

గుజరాత్ :

ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రంలో ఇప్పటివరకు 308 కరోనావైరస్ కేసులు నమోదు కాగా, 31 రికవరీలు నమోదయ్యాయి. రాష్ట్రంలో సంక్రమణతో 19 మంది మరణించారు.

కర్ణాటక :

రాష్ట్రంలో 207 కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, 6 మరణాలు నమోదయ్యాయి. 31 మందిని నయం చేసి డిశ్చార్జ్ చేశారు.

జమ్మూ కాశ్మీర్ :

జమ్మూ కాశ్మీర్ లో కేసుల సంఖ్య 207 కు పెరిగింది. 4 గురు సంక్రమణతో మరణించగా, 6 మందికి నయమైంది.

హర్యానా మరియు పంజాబ్ :

హర్యానాలో 177, పంజాబ్ లో 132 కోవిడ్ -19 కేసులు ఉన్నాయి. పంజాబ్‌లో 11 మంది మరణించగా, హర్యానాలో మూడు మరణాలు సంభవించాయి. పంజాబ్‌లో 5 మంది కోలుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌ :

వైరస్ బారిన పడిన వారు 116 మంది ఉన్నారు. రాష్ట్రంలో 5 మరణాలు, 16 రికవరీలు జరిగాయి.

ఒడిశా : 48 మంది కోవిడ్ -19 పాజిటివ్ రోగులు ఉన్నారు, అందులో ఇద్దరు కోలుకోగా, ఒక వ్యక్తి మరణించాడు.

బీహార్ : 60 మందికి కరోనావైరస్ పాజిటివ్ రాగా, ఒకరు మరణించారు.

అస్సాం : 29 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఒక వ్యక్తి కోలుకున్నాడు.

ఉత్తరాఖండ్‌ : 35 మంది కరోనావైరస్ రోగులు ఉండగా, ఇందులో ఐదుగురు రోగులు ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్నారు.

చండీగర్ : 18 మందికి కోవిడ్ -19 వ్యాధి సోకింది, ఇందులో ఏడుగురు కోలుకున్నారు.

అండమాన్ : 11 కరోనావైరస్ కేసులను నమోదు అయ్యాయి.

ఛత్తీస్‌గడ్ : 18 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.. ఇందులో 9 మంది కోలుకున్నారు.

లడఖ్‌ : 15 మందికి వ్యాధి సోకగా, 10 మంది కోలుకున్నారు.

గోవా : ఏడు కేసులు నమోదయ్యాయి, ఒక రోగి కోలుకున్నాడు.

హిమాచల్ ప్రదేశ్‌ : 28 కేసులు నమోదు కాగా, ఒక రోగి మరణించారు, 6 మంది కోలుకున్నారు.

పాండిచేరి : ఐదు కేసులు నమోదయ్యాయి, ఇందులో ఒకరు కోలుకున్నారు.

జార్ఖండ్‌ : 14 కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో ఒక రోగి మరణించారు.

మణిపూర్‌ : రెండు కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, ఇందులో ఒకరు కోలుకున్నారు.

అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, త్రిపుర లో ఒక కేసు మాత్రమే నమోదు అయింది.

Tags:    

Similar News